బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పై మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ విమర్శలు గుప్పించారు. నితీష్ కుమార్.. నలుగురు చేతుల్లో బందీగా ఉన్నారని ఆరోపించారు.
ఆధారాలు ఉంటే అరెస్టు చేసుకోవాలని ఎన్డీయే ప్రభుత్వానికి సవాల్ విసిరారు. శుక్రవారం ఆర్జేడీ 28వ వార్షికోత్సవం సందర్భంగా పాట్నాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తేజస్వీ మాట్లాడారు.. నితీష్ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం అవినీతి, నేరాల్ని ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు.
బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఆస్తులు వివరాలను క్యాబినెట్ సెక్రటేరియట్ విడుదల చేసింది. 2023 డిసెంబర్ 31 వరకు విడుదల చేసిన ఈ ప్రకటనలో.. చర, స్థిరాస్తి నుండి రుణాల వరకు ప్రతిదీ చర్చించబడింది. సీఎం నితీష్ కుమార్ కు రూ.1.64 కోట్ల ఆస్తులున్నాయి. అతని వద్ద రూ.22,552 నగదు, రూ.49,202 వివిధ బ్యాంకు ఖాతాల్లో జమయ్యాయి. కాగా.. ఈసారి నితీష్ కుమార్ తన కుమారుడి పేరు మీద ఉన్న ఆస్తి గురించి సమాచారం ఇవ్వలేదు. ఇదిలా…