Tejas MK1A: స్వదేశీ తయారీ యుద్ధ విమానం తేజస్ MK1A కోసం ఇంజిన్లను అందించే అమెరికన్ కంపెనీ జీఈ ఏరోస్పేస్ కంపెనీపై భారత్ భారీ జరిమానా విధించినట్లు తెలుస్తోంది. జనరల్ ఎలక్ట్రిక్(GE) ఏరోస్పేస్ తేజస్ కోసం F404-IN20 ఇంజిన్‌లను అందించడంలో విఫలమైంది. నిజానికి జీఈ 2023లోనే ఇంజిన్ల డెలివరీ ప్రారంభించాలి. చాలా సందర్భాల్లో ప్రధాని నరేంద్రమోడీతో పాటు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అమెరికా పర్యటనల సందర్భంగా ఆలస్యాన్ని లేవనెత్తినట్లు నివేదికలు తెలిపాయి.
Tejas Jet: ఇండియాలో తయారవుతున్న తేజస్ యుద్ధవిమానాలకు భారీగా క్రేజ్ ఏర్పంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ఈ యుద్ధ విమానాన్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తు్న్నాయి. తేజస్ లైట్ కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో ఇండియాలోనే తయారవుతోంది. హిందూస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్(HAL) ఈ ఫైటర్ జెట్లను తయారు చేస్తోంది.
అర్జెంటీనా, ఈజిప్ట్‌లు భారత్ స్వయంగా అభివృద్ధి చేసిన లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (LCA) తేజస్‌ను కొనుగోలు చేయడంలో ఆసక్తిని కనబరచడంలో అనేక ఇతర దేశాలలో చేరాయి.