Tejas Fighter Jet: పూర్తిగా స్వదేశీ టెక్నాలజీపై ఆధారపడి తయారైన తేలికపాటి యుద్ధ విమానం ‘తేజస్’ రాజస్థాన్‌లో కుప్పకూలింది. 23 ఏళ్ల తేజస్ చరిత్రలో తొలిసారిగా విమానం క్రాష్ అయింది. జైసల్మేర్‌లోని హాస్టల్ కాంప్లెక్స్ సమీపంలో కుప్పకూలింది. పైలెట్ ఎజెక్షన్ ద్వారా ప్రాణాలతో బయటపడ్డారు. 2001లో టెస్ట్ ఫ్లైట్ ద్వారా ప్రారంభమైన ఈ స్వదేశీ యుద్ధవిమానం కూలిపోవడం ఇదే తొలిసారి.