ఉద్యమకారిణి తీస్తా సెతల్వాద్‌కు మంజూరైన మధ్యంతర బెయిల్‌ను తదుపరి విచారణ జూలై 19 వరకు పొడిగిస్తున్నట్టు సుప్రీంకోర్టు బుధవారం ప్రకటించింది. బుధవారం వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను విచారించే వరకు బెయిల్ కొనసాగనుందని ప్రకటించింది.
Teesta Setalvad: 2002 గుజరాత్ అల్లర్ల కేసులో కల్పిత సాక్ష్యాలను సృష్టించడం, పలువురుని కేసులో ఇరికించేందుకు కుట్ర చేసిన కేసులో ప్రముఖ హక్కుల నేత తీస్తా సెలత్వాడ్ నిందితురాలిగా ఉన్నారు. తాజాగా ఈ కేసులో ఆమెను వెంటనే లొంగిపోవాలని, బెయిల్ తిరస్కరిస్తూ గుజరాత్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. శనివారం వెంటనే లొంగిపోవాలని ఆదేశించింది. గతేడాది సెప్టెంబరులో ఆమెకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఇప్పటివరకు ఆమెను అరెస్టు చేయలేదు.
Gujarat riots case.. SC grants interim bail to Teesta Setalvad: 2002లో జరిగిన గుజరాత్ అల్లర్ల కేసులో అమాయకులను ఇరికించేందుకు ప్రయత్నించేందుకు కల్పిత పత్రాలు, ఆరోపణలు చేశారనే కేసులో ప్రముఖ ఉద్యమకారిణి తీస్తా సెతల్వాడ్ ను గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా ఆమెకు సుప్రీంకోర్టు శుక్రవారం మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది. మా దృష్టిలో తీస్తా సెతల్వాడ్ బెయిల్ కు అర్హురాలు అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అయితే తీస్తా సెతల్వాడ్ విచారణకు…
గుజరాత్ అల్లర్లలో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి అయిన నరేంద్ర మోదీని ఇరికించేందుకు కుట్ర పన్నినట్లుగా గుజరాత్ పోలీసులు పేర్కొన్నారు. 2002లో గుజరాత్ అల్లర్లకు నరేంద్ర మోదీ కారణం అని ఆయన్ను ఈ కేసులో ఇరికించేందుకు పన్నిన కుట్రలో భాగంగానే ఉద్యమకారిణి తీస్తా సెతల్వాడ్ పనిచేశారని చెబుతూ.. ఆమె బెయిల్ పిటిషన్ ను శుక్రవారం గుజరాత్ పోలీసులు వ్యతిరేకించారు. కాంగ్రెస్ దివంగత నేత, సోనియాగాంధీ సలహాదారు గా ఉన్న అహ్మద్ పటేల్ పన్నిన కుట్రలో తీస్తా సెతల్వాడ్ భాగమయ్యారని…
భారత్ లో మతస్వేచ్ఛపై పదేపదే విషాన్ని గుప్పిస్తున్న యూఎస్ కమిషన్ ఫర్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడం ( యూఎస్సీఐఆర్ఎఫ్)పై భారత్ ఘాటుగా స్పందించింది. జూలై 2న భారత్ కు వ్యతిరేఖంగా ఈ సంస్థ పలు ట్వీట్లను పెట్టింది. భారత్ లో ప్రశ్నించే గొంతులను, ముఖ్యంగా మైనారిటీల అణచివేత కొనసాగుతోందని.. దీనిపై వారంతా ఆందోళన చెందుతున్నారని ట్వీట్ చేసింది. దీంట్లో ఇటీవల ముంబైకి చెందిన ప్రముఖ ఉద్యమకారిణి తీస్తా సెతల్వాడ్ అరెస్ట్ గురించి కూడా కమిషన్ ప్రస్తావించింది. భారతదేశంలో…