Reel On Track: రీల్స్ పిచ్చి యువత ప్రాణాలను తీస్తోంది. సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించాలని, వ్యూస్, సబ్‌స్క్రైబర్లను పెంచుకోవాలనే పిచ్చి కోసం ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఓ 15 ఏళ్ల బాలుడు కూడా ఇదే విధంగా మరణించాడు. ఒడిశాలోని పూరిలోని రైల్వే ట్రాక్‌పై రీల్ షూట్ చేస్తున్న సమయంలో రైలు ఢీకొని మరణించాడు.