Banakacharla Project: బనకచర్ల ప్రాజెక్ట్‌కు సంబంధించి సాంకేతిక, పరిపాలన వ్యవహారాల పరిశీలన కోసం 12 మంది సభ్యులతో కూడిన టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేసే దిశగా కేంద్ర జలసంఘం ప్లాన్ చేస్తుంది.
కాళేశ్వరం కమిషన్ వద్ద మాజీ సీఎస్ ఎస్కే జోషి, మాజీ ఐఏఎస్ రజత్ కుమార్ బహిరంగ విచారణ ముగిసింది. కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ ఓపెన్ కోర్ట్ విచారణకు రిటైర్డ్ సీఎస్, రిటైర్డ్ ఇరిగేషన్ సెక్రటరీ శైలేంద్ర కుమార్ జోషి హాజరయ్యారు. తుమ్మిడిహట్టి నుంచి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును ఎందుకు మార్చారని కమిషన్ ప్రశ్నించింది. అక్కడ నీటి లభ్యత ఎక్కువ లేదని సీడబ్ల్యూసీ చెప్పిందన్న ఎస్కే జోషి కమిషన్‌కు తెలిపారు.
కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చే విషయాన్ని గత కొంతకాలంగా వాయిదా వేస్తూ వచ్చిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు సిద్ధమైంది.. మరో 24 గంటల్లోగా కోవాగ్జిన్‌పై గుడ్‌న్యూస్ చెబుతాం అంటున్నారు డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధులు. కోవాగ్జిన్ వ్యాక్సిన్‌కు సంబంధించిన మరింత డేటాను భారత్ బయోటెక్.. డబ్ల్యూహెచ్‌వోకి సమర్పించింది.. దీనిపై ఇవాళ డబ్ల్యూహెచ్‌వో సాంకేతిక కమిటీ సమీక్ష నిర్వహించింది. ఈ సందర్భంగా.. 24 గంటల్లో కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి ఆమోదం లభించే అవకాశం…