Layoffs 2025: ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం టెక్ ప్రపంచంలో "ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)" మాటే వినిపిస్తోంది. రానున్న రోజుల్లో ప్రపంచాన్ని శాసించే దిశగా ఏఐ అడుగులు వేస్తోంది. అయితే, ఇప్పుడు ఏఐ అభివృద్ధి ఉద్యోగులకు చేటు చేయబోతోంది. 2025లో ప్రపంచవ్యాప్తంగా టెక్, ఇతర ఇండస్ట్రీల్లో వేల సంఖ్యలో ఉద్యోగాలు పోయే అవకాశం ఉందని తెలుస్తోంది. 2025లో భారీ సంఖ్యలో టెక్ లేఆఫ్స్ ఉండబోతున్నాయి.