వాయు కాలుష్యం.. సహజ వాయువులతో నిండిన వాతావరణాన్ని కలుషితం చేసి, మనుషుల ఆరోగ్యంతో పాటు జీవావరణ సమతౌల్యతను, జీవరాశుల ఉనికిని నాశనం చేస్తుంది. శ్వాసక్రియ నుంచి స్ట్రాటో ఆవరణలోని ఓజోన్ పొర వరకు అన్నింటినీ దెబ్బతీస్తుంది. చెట్లను నరికివేయడం, జనాభా పెరగడం వంటి అనేక కారణాల వల్ల వాయు కాలుష్యం విపరీతంగా పెరిగి మానవ ఆరోగ్యం దెబ్బతింటోంది. ఇలాంటి పరిస్థితుల్లో రాబోయే తరాలు స్వచ్ఛమైన గాలి పీల్చేలా పర్యావరణాన్ని కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి.