Shubman Gill: టీమిండియా యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ బాలీవుడ్ హీరోయిన్‌తో ప్రేమాయణం నడుపుతున్నాడు. ఈ మేరకు అతడు బాలీవుడ్ హీరోయిన్ సారా అలీఖాన్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కొన్నిరోజుల క్రితం వీళ్లిద్దరూ డిన్నర్‌కు వెళ్లిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో అభిమానులు ఏదో ఉందని గుసగుసలాడుకున్నారు. ప్రస్తుతం కెరీర్‌లో ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్ ఇటీవల ఓ పంజాబీ టాక్ షోలో పాల్గొన్నాడు. ఈ షోలో సారా అలీఖాన్‌తో డేటింగ్ అంశంపై ప్రశ్నించగా శుభమన్ గిల్ స్పందించాడు. అయితే అతి తెలివిగా అతడు ‘సారా కా సారా సచ్ బోల్ దియా(మొత్తం చెప్పేశాను) నేను డేటింగ్‌లో ఉండొచ్చు.. ఉండకపోవచ్చు’ అంటూ డేటింగ్ నిజమే అన్న రీతిలో బదులిచ్చాడు.
Read Also: Tamannaah: పెళ్లి పీటలు ఎక్కనున్న మిల్కీ బ్యూటీ.. వరుడు అతడేనా..?
అలాగే బాలీవుడ్‌లో అత్యంత ఫిట్‌గా ఉండే నటి ఎవరని అడగ్గా.. సారా అంటూ గిల్ సమాధానం చెప్పాడు. దీంతో వీళ్లిద్దరి మధ్య ప్రేమాయణం నిజమేనని అభిమానులు విశ్వసిస్తున్నారు. త్వరలోనే శుభమన్ గిల్, సారా అలీఖాన్ పెళ్లి చేసుకోనున్నట్లు తెలుస్తోంది. గతంలో అర్జున్ టెండూల్కర్ కుమార్తె సారాతో కూడా గిల్ ప్రేమాయణం జరిపినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల బ్రేకప్ అయ్యింది. కాగా ఇప్పటి వరకు 12 వన్డేలు ఆడిన శుభ్‌మన్ గిల్ 579 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ ఉంది. 11 టెస్టులు ఆడి 579 పరుగులు చేశాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని జట్టులో శుభ్‌మన్‌కు అవకాశం దక్కింది. ఈ సిరీస్‌లో ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్ ఓపెనర్లుగా బరిలోకి దిగే అవకాశాలున్నాయి. సీనియర్ల గైర్హాజరీలో తనకు దక్కిన అవకాశాన్ని గిల్ వినియోగించుకుంటాడో లేదో వేచి చూడాలి.