Gautam Gambhir: గత ఏడాది న్యూజిలాండ్ ఇప్పుడు దక్షిణాఫ్రికా భారతదేశానికి వచ్చి టెస్ట్ సిరీస్‌లలో టీమిండియాను వైట్‌వాష్ చేశాయి. ఈ రెండు సిరీస్‌లలో టీమిండియా ఓడిపోయింది. ఈక్రమంలో గౌతమ్ గంభీర్‌ను ప్రధాన కోచ్‌గా తొలగించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ డిమాండ్లపై గౌతమ్ తనదైన శైలిలో స్పందించారు. తన నాయకత్వంలోనే జట్టు ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుందని గంభీర్ స్పష్టం చేశారు. అయితే హెడ్ కోచ్ పదవి విషయంలో తాను ఏ నిర్ణయం తీసుకోనని, భారత క్రికెట్ నియంత్రణ బోర్డు…
సొంతగడ్డపై భారత్ ఘోర పరాజయంను చవిచూసింది. దక్షిణాఫ్రికాతో గువాహటిలో జరిగిన రెండో టెస్టులో ఏకంగా 408 పరుగుల తేడాతో ఓడిపోయింది. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 140 పరుగులకే ఆలౌట్ అయింది. రవీంద్ర జడేజా (54) టాప్ స్కోరర్. టాప్ బ్యాటర్లు అందరూ విఫలమయ్యారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో సైమన్ హార్మర్ 6 వికెట్లతో భారత్ పతనాన్ని శాసించాడు. కేశవ్ మహారాజ్ 2 వికెట్లు పడగొట్టగా.. ముత్తుస్వామి, మార్కో యాన్సన్ చెరో వికెట్ తీశారు. ఈ ఓటమితో టీమిండియా టెస్ట్…
గత నవంబరులో సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో భారత్ భంగపడిన విషయం తెలిసిందే. మూడు టెస్టుల సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురై.. తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. స్పిన్ ఆడడంలో మేటి జట్టుగా పేరున్న టీమిండియా.. సొంతగడ్డపై అదే స్పిన్ ఉచ్చులో పడడం భారత క్రికెట్‌ను కుదిపేసింది. స్వదేశంలో మరోసారి ఇలాంటి పరాభవం చూడబోమని అటు మాజీలు, ఇటు ఫాన్స్ అనుకున్నారు. కానీ ఇప్పుడు టీమిండియాకు మరో వైట్‌వాష్ తప్పేలా లేదు. ఇప్పటికే కోల్‌కతా జరిగిన మొదటి టెస్టులో ఓడిన భారత్..…