ఏపీలో టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త అందించేందుకు పాఠశాల విద్యాశాఖ రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు జూన్‌లో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నిర్వహించేందుకు కసరత్తులు మొదలుపెట్టింది. 2018 తర్వాత రాష్ట్రంలో ఇప్పటి వరకు టెట్ నిర్వహించలేదు. 2018 నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంఆ వేల మంది విద్యార్ధులు బీఈడీ, డీఈడీ పూర్తి చేసి డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఉపాధ్యాయ నియామకాల్లో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ…
టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) క్వాలిఫైయింగ్ సర్టిఫికేట్ యొక్క చెల్లుబాటు కాలం ఇప్పటి వరకు ఏడు సంవత్సరాలు ఉండగా.. ఇకపై జీవితకాలం పనిచేయనుంది.. దీనిపై కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.. గత ఏడాదిలో టెట్ వ్యాలిడిటీని శాశ్వతం చేయాలని జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సీటీఈ) పాలక మండలి నిర్ణయించింది. ఇప్పటివరకు టెట్ వ్యాలిడిటీ ఏడేళ్లు మాత్రమే ఉండగా.. ఇకపై దాన్ని జీవితకాలం వ్యాలిడిటీగా మార్చాలని నిర్ణయించింది. దీని ప్రకారం ఇకపై టెట్‌లో అర్హత…