పాఠశాల ఉపాధ్యాయులు పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి, సమాజాభివృద్ధికి వారిని సిద్ధం చేస్తారు. అయితే ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లో ఓ ఉపాధ్యాయుడు అందుకు విరుద్ధంగా వ్యవహరించాడు. ప్రస్తుతం అతడి వీడియో వైరల్ అవుతోంది. ఓ విద్యార్థినికి చెందిన కుటుంబీకులు ఉపాధ్యాయుడిని కొట్టడం వీడియోలో చూడొచ్చు. తొమ్మిదో తరగతి విద్యార్థినికి అసభ్యకరమైన మెసేజ్‌లు పంపినందుకు ఉపాధ్యాయుడిని కొట్టినట్లు సమాచారం.