మన దేశంలో చాలామందికి టీతో కలిసి బిస్కెట్లు తినడం రోజువారీ అలవాటుగా మారింది. ఉదయం నిద్రలేవగానే ఒక కప్పు టీతో పాటు బిస్కెట్లు తినడం ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు. అయితే ఈ అలవాటు శరీరానికి హానికరని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. మార్కెట్‌లో లభించే బిస్కెట్లలో ఎక్కువగా శుద్ధి చేసిన పిండి, చక్కెర, ఉప్పు, ప్రిజర్వేటివ్‌లు ఉంటాయని న్యూట్రిషియన్లు చెబుతున్నారు. ఇవి టీతో కలిసి తిన్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరిగి తర్వాత వేగంగా పడిపోతాయంటున్నారు. దీర్ఘకాలంలో…