తెలుగు రాష్ట్రాల ప్రజలకు టీడీపీ చంద్రబాబు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరం ఆనందోత్సాహాలతో గడవాలని కోరుకున్నారు. ప్రతి ఇంటా సంతోషం, చిరునవ్వులు విరియాలని ఆయన ఆకాంక్షించారు. కొవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ వేడుకలు నిర్వహించుకోవాలని సూచించారు.
Read Also:న్యూ ఇయర్ విషెస్ తెలిపిన తెలుగు రాష్ట్రాల సీఎంలు
కొత్త ఆశలు, కొత్త ఆకాంక్షలతో ఉత్సాహంగా కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలన్నారు. 2022 ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ఒమిక్రాన్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు కోరారు.