వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటింది. ఈ మూడేళ్లు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నందికొట్కూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో వైసీపీ అంతర్గత కుమ్ములాటలతోనే కాలం గడిచిపోయింది. పార్టీ నేతలే కొట్టుకోవడం, కేసులు పెట్టుకోవడం..కామన్‌గా మారింది. నందికొట్కూరులో ఎమ్మెల్యే ఆర్థర్, శాప్ చైర్మన్ బైరెడ్డి సిధార్థ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న సంగతి తెలిసిందే. ఇక్కడ వర్గపోరు రక్తపోరుగా మారడానికి గీతలేవీ లేవు. సమయం సందర్భం వస్తే వైరిపక్షాలుగా మారి ఘర్షణ పడుతుంటారు. నందికొట్కూరు వైసీపీలో విభేదాలను పరిష్కరించడానికి…
మేకపాటి గౌతంరెడ్డి ఆకస్మిక మరణంతో నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీకి త్వరలో ఉపఎన్నిక జరగనుంది. మొదట్లో గౌతంరెడ్డి వారసురాలిగా ఆయన సతీమణి శ్రీకీర్తి రాజకీయాల్లోకి వస్తారని భావించారు. శ్రీకీర్తి అభ్యర్థి అయితే టీడీపీ కూడా తమ అభ్యర్థిని పెట్టబోమని సంకేతాలు ఇచ్చింది. దీంతో ఉపఎన్నిక ఏకగ్రీవం అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ గౌతంరెడ్డి కుటుంబం.. శ్రీకీర్తి కాకుండా ఆయన సోదరుడు విక్రంరెడ్డిని అభ్యర్థిగా ఉంటారని ప్రకటించింది. ఇదే సమయంలో రాజమోహన్ రెడ్డి సోదరి కుమారుడు బిజీవేముల రవీంద్రరెడ్డి…
చంద్రబాబు నన్ను బలిపశువును చేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బీద మస్తాన్ రావు.. ఏపీలో ఖాళీగా ఉన్న నాలుగు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసిన సీఎం వైఎస్ జగన్.. బీద మస్తాన్ రావుకు కూడా అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే.. ఇక, ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన వైసీపీ రాజ్యసభ అభ్యర్థి బీద మస్తాన్ రావు… పెద్దల సభకు ముఖ్యమంత్రి జగన్ నన్ను పంపించటం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని తెలిపారు.. జాతీయ స్థాయిలో వెళ్లటం అరుదైన అవకాశంగా…
టీడీపీలో పనిచేసిన బీసీ నేతలే సీఎం జగన్‌కు దిక్కయ్యారంటూ ఎద్దేవా చేశారు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న.. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ నేతల్ని ప్రజలు తరిమికొడుతున్నందుకే కొత్తగా బీసీ మంత్రుల బస్సు యాత్ర అంటున్నారు.. చంద్రబాబు బాదుడే బాదుడు కార్యక్రమానికి వస్తున్న స్పందనతో జగన్ బీసీ జపం అందుకున్నారని సెటైర్లు వేశారు. ఆర్.కృష్ణయ్య బీసీల కోసం పోరాటాలు చేశారా లేక తన పదవుల కోసం పోరాటం చేశారా..? అని ప్రశ్నించిన ఆయన..…
క్విట్ చంద్రబాబు… సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదంతో 2024 ఎన్నికలకు వెళ్తామని ప్రకటించారు ఏపీ మంత్రి ఆర్కే రోజా.. ఇవాళ ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు మంత్రులు అంబటి రాంబాబు, రోజా, ఉషశ్రీ, ఎంపీలు గురుమూర్తి, కృష్ణదేవారయులు.. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి రోజా… కడప వేదికగా అభివృద్ధి, సీఎం వైఎస్ జగన్‌పై చంద్రబాబు చేసిన విమర్శలపై ఘాటుగా స్పందించారు.. కడపలో చంద్రబాబు చేసిన విమర్శలు హస్యాస్పదమన్న ఆమె.. కుప్పంలో జరిగిన అభివృద్ది, పులివేందులలో జరిగిన అభివృద్దిని పరిశీలించాలని…
ఏపీలో అధికార, ప్రతిక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.. ఎవ్వరూ తగ్గకుండా పోటీపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు.. వాతారణం చూస్తుంటే.. అప్పుడు ఎన్నికలు వస్తాయా? అనే అనుమానాలు కలిగిస్తోంది.. గత కొంత కాలంగా చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి అంబటి రాంబాబు.. అక్క ఆరాటమే తప్ప బావ బతకడు.. అంటూ సెటైర్లు వేశారు. కొన్ని పత్రికల ఆరాటమే తప్ప చంద్రబాబు రాజకీయంగా బతకరని జోస్యం చెప్పారు.. చంద్రబాబు పగటి కలలు కంటున్నారు.. కానీ, షెడ్యూల్ ప్రకారమే…
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీడీపీ సిద్ధంగా ఉందని ప్రకటించిన ఆయన.. గడప గడపకు వైసీపీ అని పెడితే ప్రజలు వెంటపడతారని గడప గడపకు మన ప్రభుత్వం అని పెట్టారని.. బాదుడే బడుడుతో టీడీపీ ప్రజల వద్దకు వెళ్తుందని పోటీగా వైసీపీ కార్యక్రమాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తాడికొండలో ప్రభుత్వ పనితీరుని ప్రశ్నించిన వెంకాయమ్మ అనే మహిళపై దాడి చేసి అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డ…
విజయనగరం రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తిగా ఉంటాయి. అలాంటి చోట టీడీపీలో వర్గపోరు తారాస్థాయికి చేరుకుంటోంది. ఎవరి నోట విన్నా ఆ మహిళా నేతలే పేర్లే చర్చల్లో ఉంటున్నాయి. విజయనగరంపై పట్టుకోసం అదితి గజపతిరాజు, మాజీ ఎమ్మెల్యే మీసాల గీత గట్టిగా పోటీ పడుతున్నారు. 2019 ఎన్నికల నుంచి ఇప్పటి వరకు అదే పరిస్థితి ఉంది. 2019లో సిట్టింగ్ ఎమ్మెల్యే మీసాల గీతను కాదని.. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి గజపతిరాజుకు టికెట్ ఇచ్చారు.…
మండవ వెంకటేశ్వరరావు ఎమ్మెల్యేగా.. మంత్రిగా ఒకప్పుడు రాజకీయాల్లో చక్రం తిప్పిన నాయకుడు. అప్పట్లో టీడీపీ అధినేత ఎన్టీఆర్, చంద్రబాబులకు కుడిభుజంగా పేరుతెచ్చుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత పొలిటికల్ తెరపై మండవ పేరు పెద్దగా వినిపించలేదు. కొన్నాళ్లు రాజకీయాల్లో సైలెంట్‌గా ఉన్నప్పటికీ.. మొన్నటి లోక్‌సభ ఎన్నికల ముందు గులాబీ కండువా కప్పుకొన్నారు. సీఎం కేసీఆర్ నేరుగా మండవ ఇంటికి వెళ్లి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. రాజకీయంగా పాత పరిచయాలు.. స్నేహం ఉండటంతో సైకిల్ దిగి.. కారెక్కేశారు మండవ. ఆ సమయంలోనే…
ఏపీలో ఉన్న బీసీలు.. బీసీలు కాదా..? అంటూ సోషల్ మీడియా వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిలదీశారు టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు.. ఏపీలో ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాలకు వైఎస్సార్సీపీ అభ్యర్థులను సీఎం వైఎస్ జగన్ ఖరారు చేశారు. విజయసాయిరెడ్డికి మరోసారి అవకాశం కల్పించిన ఆయన.. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, బీసీ సామాజిక వర్గానికి చెందిన బీద మస్తాన్‌రావును, సుప్రీం కోర్టు న్యాయవాది నిరంజన్‌రెడ్డికి అవకాశం కల్పిస్తూ రాజ్యసభ అభ్యర్థులుగా…