ఎన్నికల సంఘం తీసుకున్న కీలక నిర్ణయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్... కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుందన్న ఆయన.. ఇక, బల్క్ ఫారమ్-7 డిలీషన్స్ చెల్లవు.. బల్క్ ఫారమ్- 7 అప్లికేషన్లు ఆన్ లైన్ లో తీసుకోవద్దని సీఈసీ ఆదేశించిందని తెలిపారు.
కొల్లు రవీంద్రకు దేవుడు ఒక శాపం ఇచ్చాడని అది సిగ్గు లేకుండా మాట్లాడటమని మాజీ మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు. బందరు అభివృద్ధిలో నువ్వు చేసింది ఏమిటో నేను చేసింది ఏమిటో శ్వేత పత్రం విడుదల చేద్దామా అంటూ నాని కొల్లు రవీంద్రకు సవాల్ విసిరారు.
గత ఎన్నికలలో గెలుస్తామో లేదో తెలియదు కానీ బరిలో నిలబడాలి అని నిర్ణయించి పోటీకి దిగానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ సారి పరిస్థితి అలా ఉండదన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నామని పవన్ ధీమా వ్యక్తం చేశారు. జగన్ మహాత్ముడు అయితే మనం ఒంటరిగా పోటీ చేయవచ్చని.. కానీ జగన్ ప్రజా కంటకుడు అని విమర్శలు గుప్పించారు.
పేద పిల్లలకు అంతర్జాతీయ స్థాయి విద్య అందిస్తుంటే చంద్రబాబుకు కనిపించటం లేదని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున పేర్కొన్నారు. ఏదో విధంగా ఎస్సీలను మోసం చేయాలనే దుష్ట ఆలోచన చంద్రబాబుది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్పై మాజీ ఎమ్మెల్యే, ఉరవకొండ నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్కు తప్పుడు సమాచారం ఇచ్చిన టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్పై కేసు నమోదు చేయాలని ఆయన పేర్కొన్నారు
నేడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తిరుమలలో శ్రీవారిని దర్శనం చేసుకుని అమరావతికి రానున్నారు. తిరుపతి నుంచి మధ్యాహ్నం 12:30 గంటలకు గన్నవరం చేరుకోనున్నారు.
ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. దొంగే దొంగ అన్నట్లు వైసీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేస్తున్నారు.. ఎన్నికలు ఎప్పుడు జరిగినా జగన్ చిత్తు చిత్తుగా ఓడిపోతారు అంటూ ఆయన పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ అదేశాలిస్తున్నా.. కలెక్టర్లు చెత్తబుట్టలో వేస్తున్నారు.. 8 జిల్లాల కలెక్టర్లు అడ్డగోలుగా పని చేస్తున్నారు
రాజోలు నియోజకవర్గంలో రాజకీయం రాజుకుంటుంది.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. తాటిపాక బహిరంగ సభలో నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.. లోకేష్ ఆలోచించకుండా, తెలియకుండా మాట్లాడటం సరికాదని హితవుపలికారు.