ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో.. వైసీపీ నేతలు ఓటమి నుంచి తేరుకోలేకపోతున్నారు. ఈ సందర్భంగా.. కడపలో మాజీ డిప్యూటి సీఎం అంజాద్ బాషా మీడియా సమావేశం నిర్వహించారు. ప్రజల తీర్పును గౌరవిస్తూ, నూతన ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ విజయం కోసం, తన విజయం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. కార్పొరేటర్ గా మొదలైన తన రాజకీయ ప్రయాణం.. రెండు…
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి భారీ విజయం సాధించింది. ఎన్డీఏతో పొత్తు పెట్టుకున్న టీడీపీ, జనసేన ప్రభంజనం సృష్టించింది. ఈ సందర్భంగా.. టీడీపీ నేతలు విజయానందంలో మునిగితేలుతున్నారు. కాగా.. విజయంపై కమలాపురం టీడీపీ ఎమ్మెల్యే పుత్తా చైతన్య రెడ్డి మాట్లాడుతూ, ప్రజల నమ్మకాన్ని నిలుపుకుంటామని తెలిపారు. చంద్రబాబు, లోకేష్ పై నమ్మకంతో ప్రతిపక్షమే లేని మెజార్టీని ప్రజలు ఇచ్చారని తెలిపారు.
Telangana CM Revanth Reddy: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి గెలుపొందడంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లకు అభినందనలు తెలిపారు రేవంత్. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇరు రాష్ట్రాల మధ్య సంబంధాలపైనా కీలక వ్యాఖ్యలు చేశారు రేవంత్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య సత్సంబంధాలను కొనసాగిస్తూ.. సమస్యలను పరిష్కరించుకుంటూ అభివృద్ధి పథం వైపు…
ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్రంలో ఎన్డీయే వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. అయితే గత రెండు ఎన్నికల మాదిరిగానే ఈసారి బీజేపీ సొంతంగా మెజారిటీ సాధించలేకపోయింది.
Ram Charan wishes to Chandrababu Naidu: 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి రికార్డు విజయం సాధించిన విషయం తెలిసిందే. కూటమి విజయంపై టాలీవుడ్‌కు చెందిన పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ టీడీపీ అధినేత చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఏపీ ఎన్నికల్లో సంచలన విజయంతో చరిత్ర సృష్టించిన విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారికి…
Chandrababu And Pawan Kalya Attend NDA Meeting: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి భారీ విజయాన్ని నమోదు చేశాయి. ప్రజలు ఏకపక్షంగా కూటమి అభ్యర్థుల్ని గెలిపించారు. ఈ నేపథ్యంలో బుధవారం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఉదయం 11 గంటలకు ఢిల్లీకి వెళ్లనున్నారు. అక్కడ ప్రధాని నరేంద్ర మోడీతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ప్రభుత్వ ఏర్పాటుపై సమాలోచనలు చేయనున్నారు.. తమకు మద్దతు ఇస్తే ఎన్డీఏ జాతీయ కన్వీనర్‌గా…
ఆంధ్రప్రదేశ్ గెలిచింది.. ఆంధ్రప్రదేశ్ ప్రజలు గెలిచారు.. ఇవాళ నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది.. టీడీపీ-జేఎస్పీ-బీజేపీ కూటమికి సేవ చేసేందుకు అఖండమైన ఆదేశంతో ఆశీర్వదించినందుకు రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు చంద్రబాబు..
India Alliance Meeting Today in Delhi on Government Formation: సార్వత్రిక ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమి గట్టి పోటీ ఇచ్చింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకింద్రులు చేస్తూ.. 199 సీట్లు సాధించింది. ‘400 సీట్లకు పైనే’ అనే నినాదంతో ఎన్నికల బరిలోకి దిగిన బీజేపీ సారథ్యంలోని ‘ఎన్డీయే’ మెజారిటీకే పరిమితం అయింది. అయితే ఎన్డీయే, ఇండియా కూటమి మధ్య సీట్ల వ్యత్యాసం ఎక్కువగా లేకపోవడంతో.. ఇరు కూటమిలు ప్రభుత్వ ఏర్పాటుపై ఇప్పటికే చర్చలు ప్రారంభించాయి. కేంద్రంలో…
ఏపీలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని శ్రీకాకుళం టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం ఎంపీగా మూడోసారి విక్టరీ సాధించారు. దీంతో ఆయన మీడియాతో మాట్లాడారు.