మంగళవారం నాడు వెలువడిన ఎన్నికల రిజల్ట్స్ లో టీడీపీ కూటమి భారీ విజయన్ని అందుకుంది. ఇకపోతే గత ఏడాది పార్టీలు మారిన అభ్యర్థులందరూ ఎన్నికల్లో ఓడిపోగా ఈసారి మాత్రం పార్టీలు మారిన అభ్యర్థులందరూ గెలవడం విశేషం. 2024 ఎన్నికల నేపథ్యంలో భాగంగా వైఎస్ఆర్సిపి నుండి టిడిపిలోకి చేరిన వారంతా విజయాన్ని సాధించారు. అలాగే వైఎస్ఆర్సిపి నుండి జనసేనలో మారిన వారు కూడా విజయనందుకున్నారు. అయితే టిడిపి నుంచి వైసీపీకి వెళ్లిన వారు, బిజెపి నుంచి వైసీపీకి వచ్చిన వారు ఓటమి చెందారు. ఎవరెవరు విజయం సాధించాలన్న విషయాన్ని చూస్తే..
Harassment: స్లీపర్ కోచ్‌లో యువతికి వేధింపులు.. తన బాధను రెడ్డిట్లో పోస్ట్
టీడీపీ లోకి ఇతర పార్టీల నుంచి వచ్చిన 5 గురు ఎంపీలు విజయం సాధించారు. ఇందులో వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు ఎంపీగా విజయం సాధించగా.. నరసరావుపేట ఎంపీగా లావు శ్రీకృష్ణదేవరాయలు, ఒంగోలు ఎంపీగా మాగుంట శ్రీనివాసుల రెడ్డి, బీజెపీ నుంచి టీడీపీలో చేరిన బైరెడ్డి శబరి నంద్యాల ఎంపీగా, తన్నేటి కృష్ణప్రసాద్ బాపట్ల ఎంపీగా విజయం అందుకున్నారు. ఇక అలాగే టీడీపీలో వివిధ పార్టీల నుంచి వచ్చిన 8 మంది ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు.
Nitish Kumar: “వన్ నేషన్-వన్ ఎలక్షన్”కి నితీష్ పార్టీ మద్దతు.. అగ్నిపథ్ స్కీమ్‌ని మాత్రం..
ఈ లిస్ట్ లో వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వేంరెడ్డి ప్రశాంతి రెడ్డి నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గం నుండి విజయం సాధించింది. ఆత్మకూరు నియోజకవర్గంలో ఆనం రామనారాయణరెడ్డి, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గంలో కొలుసు పార్థసారథి, మైలవరం నియోజకవర్గంలో వసంత కృష్ణ ప్రసాద్, గుంతకల్లులో మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం, సత్యవేడు అసెంబ్లీ నియోజవర్గంలో కోనేటి ఆదిమూలం గెలుపొందారు. ఇక వైసీపీ అధికారంలో ఉన్నపుడే ఎంపి రఘురామ కృష్ణరాజు పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరగా.. టీడీపీ నుండి ఉండి ఎమ్మెల్యే టిక్కెట్టు ఇచ్చింది. అక్కడ ఆయన భారీ మెజార్టీతో విజయకేతనం ఎగరవేశారు.