రాష్ట్రంలోని సలహాదారులను అందర్నీ ఏపీ ప్రభుత్వం తొలగించింది. మొత్తంగా 40 మంది సలహాదారులను తొలగిస్తూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 4వ తేదీ నుంచి తొలగింపు ఉత్తర్వుల్లో జీఏడీ వెల్లడించింది.
Nagababu Clarity on TTD Chairman Post: ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం -బిజెపి – జనసేన కూటమి భారీ మెజారిటీతో గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ నెల 12వ తేదీన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే క్యాబినెట్లో జనసేన మంత్రులు ఎంతమంది ఉంటారు? బీజేపీ మంత్రులు ఎంతమంది ఉంటారు? అనే విషయం మీద ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి. అయితే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకి టీటీడీ చైర్మన్ పదవి లభించబోతోంది అంటూ…
చంద్రబాబు మారరు అనే అపవాదు తనపై ఉందని... కానీ మీరు మారిన చంద్రబాబును చూస్తారని.. ఇక అలా ఉండదని.. మీరే ప్రత్యక్షంగా చూస్తారని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పార్టీ ఎంపీలతో జరిగిన భేటీలో టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల భాగంగా మంగళవారం నాడు జరిగిన కౌంటింగ్ ప్రక్రియలో ఎన్డీఏ కూటమి విజయం సాధించింది. 2024 లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 293 సీట్లు సాధించింది. ఇందులో దేశవ్యాప్తంగా 74 మంది మహిళ ఎంపీలు విజయాన్ని సాధించారు. లోక్సభ సీట్ల సంఖ్యలో వీరి శాతం కేవలం 13.63 శాతంగా ఉంది. మహిళలకు రిజర్వ్ చేసిన 33% కంటే ఇది చాలా తక్కువగా కనబడుతుంది. 2019లో జరిగిన లోకసభ ఎన్నికల్లో మొత్తం 78 మంది మహిళలు…
ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద కోలాహలం నెలకొంది. చంద్రబాబు, లోకేష్, ఎన్టీఆర్ బ్యానరుకు 164 బిందెలతో పాలాభిషేకం చేశారు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల్నాయుడు.
మంగళవారం నాడు వెలువడిన ఎన్నికల రిజల్ట్స్ లో టీడీపీ కూటమి భారీ విజయన్ని అందుకుంది. ఇకపోతే గత ఏడాది పార్టీలు మారిన అభ్యర్థులందరూ ఎన్నికల్లో ఓడిపోగా ఈసారి మాత్రం పార్టీలు మారిన అభ్యర్థులందరూ గెలవడం విశేషం. 2024 ఎన్నికల నేపథ్యంలో భాగంగా వైఎస్ఆర్సిపి నుండి టిడిపిలోకి చేరిన వారంతా విజయాన్ని సాధించారు. అలాగే వైఎస్ఆర్సిపి నుండి జనసేనలో మారిన వారు కూడా విజయనందుకున్నారు. అయితే టిడిపి నుంచి వైసీపీకి వెళ్లిన వారు, బిజెపి నుంచి వైసీపీకి వచ్చిన…
ఈ నెల 11న టీడీఎల్పీ సమావేశం జరుగుతుందని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు, టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వెల్లడించారు. టీడీఎల్పీలో చంద్రబాబుని నేతగా ఎన్నుకుని గవర్నర్ కు నివేదిక పంపుతామన్నారు.
ఏపీలో విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న సందర్భంగా హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
ఎన్నికల్లో గెలుపొందిన టీడీపీ ఎంపీలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఉండవల్లిలోని ఆయన నివాసంలో టీడీపీ పార్లమెంటరీ భేటీ నిర్వహించారు. సుమారు గంటన్నరపాటు సాగిన టీడీపీపీ సమావేశం జరిగింది. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పని చేయాలని ఎంపీలకు చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు.
BJP: లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది. 543 లోక్సభ సీట్లలో 293 సీట్లను ఎన్డీయే కైవసం చేసుకుంది. 240 సీట్లతో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. 2014, 2019 ఎన్నికల్లో బీజేపీ స్వయంగా మ్యాజిక్ ఫిగర్ 272ని దాటి సీట్లను కైవసం చేసుకుంది.