భారత్‌ను ప్రపంచంలో మూడో ఆర్థిక శక్తిగా మార్చిన ఘనత ప్రధాని మోడీకి దక్కుతుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. విశాఖ ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్లో జరిగిన బహిరంగ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు మోడీ ఏకతాటిపై నడిపిస్తున్నారని తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకున్నారని.. అందుకే ప్రజలు భారీ మెజార్టీ అందించారని చెప్పుకొచ్చారు. రాష్ట్రాభివృద్ధికి మోడీ ఎంతగానో సహకరిస్తున్నారని… ఇందులో భాగంగానే ఈరోజు ఏపీకి రూ.2 లక్షల కోట్ల అభివృద్ధి…
ప్రధాని మోడీ విశాఖకు రానున్నారు. ఎయిర్‌పోర్టులో గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ స్వాగతం పలికారు. సాయంత్రం 4:45 గంటల నుంచి ప్రధాని రోడ్ షో ప్రారంభం కానుంది.
ప్రధాని మోడీ కాసేపట్లో విశాఖకు రానున్నారు. ఎయిర్‌పోర్టులో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ స్వాగతం పలకనున్నారు. అనంతరం సాయంత్రం 4:45 గంటల నుంచి ప్రధాని రోడ్ షో ప్రారంభం కానుంది.
రోడ్లు వేయకుండా అడ్డుకుంటే ఊరుకోబోమని సర్పంచ్‌లను హెచ్చరించారు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా గుమ్మడి సంధ్యారాణి.. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలంలో ఈరోజు పర్యటించిన ఆమె.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
తనకు సీఎం పదవి జాక్‌పాట్ కాదని, దానికి వెనుక ఎంతో కష్టం ఉందని ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఎవరైనా సరే కష్టపడితే జీవితంలో పైకి వస్తారని పేర్కొన్నారు. టీడీపీ పార్టీ పెట్టినప్పటికీ నుండి కుప్పంలో పసుపు జెండానే ఎగిరిందని, కుప్పం ప్రజల రుణం తీర్చుకోవడానికి ఈ స్వర్ణ కుప్పం విజన్ తీసుకొచ్చానన్నారు. 2014-19 మధ్య ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడిపించామని, వైసీపీ హయాంలో 4 శాతం అభివృద్ధి తగ్గిపోయిందని సీఎం మండిపడ్డారు. 2027…
ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు కుప్పంలో పర్యటించనున్నారు. మూడు రోజుల పాటు సొంత నియోజకవర్గం కుప్పంపై సీఎం స్పెషల్ ఫోకస్ చేయనున్నారు. ‘స్వర్ణ కుప్పం’ పథకం పేరిట కుప్పం రూపురేఖలు మరింతగా మార్చనున్నారు. వచ్చే ఐదేళ్ల పాటు కుప్పం ప్రాంత సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ‘స్వర్ణ కుప్పం-విజన్ 2029’ పథకంను సీఎం ఆరంభించనున్నారు. ఆది, సోమ, మంగళవారం కుప్పంలో సీఎం చంద్రబాబు పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు. నేడు ద్రవిడ యూనివర్శిటీలో ‘స్వర్ణ కుప్పం-విజన్…
టీడీపీ మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఎట్టకేలకు దిగొచ్చారు. సినీ నటి, బీజేపీ నాయకురాలు మాధవీ లతకు ఆయన క్షమాపణలు చెప్పారు. ‘సినీ నటి మాధవీ లత గురించి ఆవేశంలో అలా మాట్లాడటం తప్పే. ఆమెకు మనస్ఫూర్తిగా క్షమాపణ చెబుతున్నాను. 72 సంవత్సరాల వయసున్న నేను ఆవేశంలో అలా మాట్లాడానే తప్ప.. కించపరచాలనే ఉద్దేశం లేదు’ అని ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఇక జేసీ, మాధవీ లత మధ్య వివాదంకు తెరపడనుంది.…
Jagan Mohan Reddy: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలమైందంటూ వైయస్సార్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. తాజాగా ఆయన కూటమి సర్కార్‌ను నిలదీస్తూ తన సోషల్ మీడియా వేదికగా సుదీర్ఘ సందేశాన్ని తెలిపారు. ఇక ఆ సందేశంలో పలు అంశాలపై సూటిగా ప్రశ్నించారు. ఇందులో ఏముందంటే.. చంద్రబాబు నాయుడు గారూ… ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలపై ఇంతటి బరితెగింపా? మేనిఫెస్టోపై ఇంతటి తేలిక తనమా? ప్రజలకు ఇచ్చిన…
Kakani Govardhan Reddy: టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ తీరును ఏపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. టీడీపీ ఎమ్మెల్యేలను విమర్శించిన వారిపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారన్నారు. అలాగే ప్రస్తుతం ప్రభుత్వ తీరును, ముఖ్యంగా ఎమ్మెల్యేలను విమర్శించిన వారిపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపడం జరుగుతున్నదని ఆయన పేర్కొన్నారు. అలాగే నెల్లూరు జిల్లా ఎస్.పి. తన విధులకు కాస్త దూరంగా ఉంటున్నాడని, వెంకటాచలం మాజీ జెడ్పిటిసి…