తాడిపత్రిలో పోటీపోటీగా కార్యక్రమాలకు పిలుపునిచ్చాయి తెలుగు దేశం పార్టీ.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. దీంతో, రేపు ఏం జరగబోతోంది? అనేది ఉత్కంఠగా మారిపోయింది.. అయితే, శాంతిభద్రతల దృష్ట్యా రేపు తాడిపత్రిలో వైసీపీ నిర్వహించదలిచిన కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించారు.. ఒకే రోజున రెండు పార్టీలు భారీగా సభలు నిర్వహిస్తే శాంతి భద్రతలకు ఆటంకం కలగవచ్చని భావించిన పోలీసులు.. వైసీపీ జిల్లా అధ్యక్షునికి కార్యక్రమాన్ని వాయిదా వేయాలని నోటీసులు జారీ చేశారు..