ఆంధ్రప్రదేశ్‌ను విద్యలో ప్రత్యేక స్థానంలో నిలబెట్టేందుకు చిత్త శుద్ధితో కృషి చేస్తున్నాం.. ఐదు, పదేళ్లలో హైలీ ఎడ్యుకేటెడ్ రాష్ట్రంగా ఏపీ ఉంటుందన్నారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. వైసీపీ కార్యాలయంలో జరిగిన మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి వేడుకల్లో.. డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, పలువురు ఎమ్మెల్యేలు, ఇతర నేతలతో కలిసి పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎయిడెడ్ విద్యా సంస్థల విషయంలో ప్రభుత్వం చాలా స్పష్టతతో ఉందన్నారు.. ఎవరిపై ఎలాంటి ఒత్తిడి…
టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ మంత్రి శంకర్ నారాయణ… అనంతపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన… రాష్ట్రంలో అత్యున్నత స్థాయిలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని దున్న అని పేరు పెట్టి పిలవడం ఎంతవరకు సమంజసం అంటూ మండిపడ్డారు.. విద్యార్థి లోకాన్ని తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకున్నందుకు తెలుగుదేశం పార్టీకి సిగ్గు అనిపించడం లేదా? అంటూ ప్రశ్నించిన మంత్రి.. సాక్షాత్తు దెబ్బతిన్న విద్యార్థులే తమపై పోలీసులు లాఠీఛార్జి చేయలేదని…
ఏపీలో జరుగుతోన్న స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు అధికార, ప్రతిక్షాల మధ్య మాటల యుద్దానికి తెరలేపాయి.. గడచిన స్థానిక ఎన్నికల మాదిరిగానే ఇప్పుడూ అరాచకాలు చేశారంటూ వైసీపీ నేతలపై మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. చాలా చోట్ల అభ్యర్థులని బెదిరించి విత్ డ్రా చేయించారన్న ఆయన.. పోలీసులే ఎన్నికల్లో సెటిల్మెంట్లు చేస్తూ అరాచకాలకు పాల్పడ్డారని ఆరోపించారు.. నామినేషన్ విషయంలో ఇన్ని జాగ్రత్తలు మేం ఎప్పుడూ తీసుకోలేదని గుర్తుచేసుకున్న టీడీపీ అధినేత.. పోటీ చేయాలనుకునే అభ్యర్థికి సహకరించాల్సిన…
ఏపీలో ఎన్నికలు జరగని పంచాయితీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల పర్వంలో టీడీపీ-వైసీపీ మధ్య ఘర్షణలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీ ఎన్నికల ఉపసంహరణ ప్రక్రియలో 8వ వార్డు ఉపసంహరణ విషయంలో మొదటినుండి హై డ్రామా నడిచింది. 8వ వార్డు టీడీపీ అభ్యర్థి నామినేషన్ ఉపసంహరించు కున్నాడని వైసీపీ అభ్యర్థి ఒక్కరే బరిలో ఉండటంతో ఏకగ్రీవంగా ప్రకటించారు. 8వవార్డులో తండ్రి కొడుకులు ఇద్దరూ టీడీపీ తరుపున పోటీ చేశారు. ఉపసంహరణలో…
ఏపీలో ఎన్నికలు జరగని మునిసిపాలిటీలు, కార్పోరేషన్లు, పంచాయతీలు, నగర పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తోంది రాష్ట్ర ఎన్నికల సంఘం. నెల్లూరు కార్పోరేషన్ ఎన్నికల అక్రమాల పై హైకోర్టును ఆశ్రయించనుంది తెలుగుదేశం పార్టీ. రిటర్నింగ్ అధికారి ఏకపక్ష నిర్ణయాలపై హైకోర్టు కు వెళ్లాలని టీడీపీ నేతలు నిర్ణయించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గి రిటర్నింగ్ అధికారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించడంపై హైకోర్టును ఆశ్రయించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చలు జరిపారు. నామినేషన్ల తిరస్కరణను సీరియస్ గా తీసుకున్న…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగిసింది. ఇవాళ చివరి రోజు భారీగా నమోదయ్యాయి నామినేషన్లు. 15న మునిసిపాలిటీ, 16న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. నెల్లూరు కార్పోరేషన్ సహా 12 మునిసిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. చంద్రబాబు స్వంత నియోజకవర్గం అయిన కుప్పం, నెల్లూరు కార్పోరేషన్ పైనే అందరి ఫోకస్ పడింది. కుప్పంలో పాగా వేయాలని వైసీపీ స్కెచ్ వేసింది. అక్కడ ఎలాగైనా పరువు నిలుపుకోవాలని టీడీపీ నేతలు పట్టుమీద వున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి…
అనంతపురంజిల్లా పెనుకొండలో నగర పంచాయితీ ఎన్నికల రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. టీడీపీ తరఫున కౌన్సిలర్ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. వీరి వెంట మాజీ ఎమ్మెల్యే పార్థసారథి తరలివచ్చి ప్రతి కౌన్సిలర్ అభ్యర్థికి తానే అన్నీ చూసుకుంటూ దగ్గరుండి నామినేషన్ లు వేయించారు. ఈ సందర్భంగా పార్థసారధి మాట్లాడుతూ పెనుకొండ మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఓడిపోతామనే పక్క జిల్లాల నుంచి కేవలం ఎమ్మెల్యేలను పిలిపించుకుని అధికారం తో గెలవాలని చూస్తుందన్నారు. ఇప్పటికే వాలంటరీ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ…
కుప్పంలో మున్సిపల్ ఎన్నికల వార్ హీటు పెంచుతుంది.. మాజీ సీఎం, టీడీపీ అధినేత సొంతం నియోజకవర్గం కావడం.. వైసీపీ ఆ స్థానంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడంతో మున్సిపల్ వార్ హీట్ పెంచుతుంది.. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ క్లీన్‌స్వీప్ చేసింది.. కుప్పంలోనూ అదే రిజల్ట్ రిపీట్ అవుతుందని దీమాతో ఉంది.. దీంతో.. సొంతగడ్డపై చంద్రబాబుకి మరో ఛాలెంజ్ ఎదురవుతోంది. కేడర్‌కు ఇప్పటికే దిశానిర్దేశం చేశారు చంద్రబాబు. అటు తమ్ముడు తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డిని సీన్లోకి…
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందని ఆరోపించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు… సీఎం వైఎస్ జగన్‌కు స్టీల్ ప్లాంట్‌పై చిత్తశుద్ధి ఉంటే… తక్షణమే అఖిపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు.. కాసేపటి క్రితం టీడీపీ ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు.. తాజాగా విడుదలైన స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌పై చర్చించారు.. ఈ ఎన్నికల్లో వైసీపీని ఓడించేలా అన్ని శక్తులను కేంద్రీకరించాలని…
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి ప్రారంభం కానుంది. ఈ ఏడాది మే 31న ఎమ్మెల్సీల పదవీ కాలం ముగిసింది. ఈ స్థానాలకు గతంలోనే ఎన్నికలు జరగాల్సి ఉంది. కరోనా వ్యాప్తి కారణంగా ఎన్నికలను వాయిదా వస్తూ వచ్చింది. ఏపీలో మూడు స్థానాలకు ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేసింది. నవంబరు 9న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. నవంబరు 19న పోలింగ్ జరుగుతుంది. అదే రోజున ఫలితాలను ప్రకటిస్తారు. ఏపీలో మే 31న ఎమ్మెల్సీల పదవీ కాలం…