ఏపీలో రాజకీయం వేడిమీద వుంది. ఒక వైపు స్థానిక ఎన్నికలు, మరోవైపు అమరావతి పాదయాత్రలతో మరింతగా హాట్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఏపీ మంత్రి జయరాం కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, టీడీపీపై విమర్శలు చేశారు. టీడీపీ భూస్థాపితం అవుతుందని, అమరావతి రైతుల మహాపాదయాత్ర కు దర్శకుడు, నిర్మాత చంద్రబాబే అన్నారు.
ఈ పాదయాత్ర న్యాయస్థానం టు దేవస్థానం కాదు. మోసం టు మోసం టైటిల్ పెడితే బాగుంటుందని ఎద్దేవా చేశారు. పాదయాత్ర కు ఆదరణ లేదని రైతు పాదయాత్ర కాదు శ్రీమంతుల యాత్రగా మారిందన్నారు. పాదయాత్ర వల్ల ప్రజలకు ఏమీ జరగదన్నారు. ప్రజలకు న్యాయం చేయాలంటే సీఎం జగన్మోహన్ రెడ్డి కే సాధ్యం అన్నారు మంత్రి జయరాం. రాయలసీమ అంటే చంద్రబాబుకు కక్ష అనీ, అందుకే న్యాయ రాజధాని పేరుతో కర్నూలుకు న్యాయం చేస్తుంటే చంద్రబాబుకు పడడం లేదన్నారు మంత్రి గుమ్మనూరు జయరాం.