ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కూడా అధ్యక్షుడు పదవి అడుగుతానని.. కానీ ఇస్తరా లేదా వాళ్ళ ఇష్టమని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. 1995 నుంచి హిందూ వాహినిలో కార్యకర్తగా పని చేసినట్లు చెప్పారు.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ టికెట్.. చేనేతల బీసీ నేత డాక్టర్ మాచాని సోమనాథ్ కు కేటాయించాలని బీసీ, చేనేత నాయకులు కోరుతున్నారు. ఈ క్రమంలో.. ఎమ్మిగనూరు పట్టణంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి పద్మశ్రీ మాచాని సోమప్ప విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ ర్యాలీలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.