నేడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వేదికగా పొలిట్ బ్యూరో సమావేశం ప్రారంభంకానుంది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అధ్యక్షతన ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 32 మంది సభ్యులు హాజరుకానున్నారు.
అమరావతిలో జరిగిన టీడీపీ అధినేత చంద్రబాబు పొలిట్ బ్యూరో సమావేశంలో కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పార్టీలో కష్టపడి పనిచేసిన వారికే అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. గతంలో ఈ సిద్ధాంతాన్ని పాటించలేక పోయామని కానీ ఈసారి దీనిని అమలు చేస్తామన్నారు. ఇక నుంచి పార్టీలో వలసలకు అవకాశం ఉండదన్నారు. ఎన్నికలకు ముందు వాసన పసిగట్టి పార్టీలోకి వచ్చే వారిని ఆహ్వానించేది లేదన్నారు. అధికార పార్టీ అనుసరిస్తున్న వ్యూహాలకు తగినట్టుగా పార్టీ బలోపేతం కావాలని,…