సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పలు రాజకీయ అంశాలపై చర్చించారు. భేటీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఏపీ సీఎం చంద్రబాబు ఎంపీలకు వివరించారు. జగన్ ఏ విధంగా ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారనే విషయాన్ని ఎంపీలకు సీఎం చంద్రబాబు వివరించినట్లు సమాచారం.
రాష్ట్రాన్ని ఆర్థికంగా గట్టెక్కించాలంటే కేంద్రం సాయం అవసరమని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఎంపీలకు కొన్ని కొన్ని శాఖలు కేటాయించారని.. కేటాయించిన శాఖలకు సంబంధించి కేంద్రం నుంచి నిధులు తెచ్చే బాధ్యత ఎంపీలపై ఉందన్నారు. వివిధ స్కీంల వచ్చే కింద కేంద్ర నిధులను ఏపీకి రప్పించే ప్రయత్నం చేస్తామన్నారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ జరిగింది. ఏపీకి రావాల్సిన పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించారు. మంత్రుల నుంచి వివిధ శాఖలకు చెందిన సమాచారాన్ని తీసుకుని కేంద్రంతో సంప్రదింపులు జరపాలని సీఎం చంద్రబాబు ఎంపీలకు సూచించారు.
ఎన్నికల్లో గెలుపొందిన టీడీపీ ఎంపీలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఉండవల్లిలోని ఆయన నివాసంలో టీడీపీ పార్లమెంటరీ భేటీ నిర్వహించారు. సుమారు గంటన్నరపాటు సాగిన టీడీపీపీ సమావేశం జరిగింది. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పని చేయాలని ఎంపీలకు చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు.