తెలుగుదేశం 40 ఏళ్ళ పండుగ తెలుగు తమ్ముళ్ళను ఖుషీ చేస్తోంది. ఒంగోలు మహానాడు సభ సక్సెస్ తో ఉమ్మడి ప్రకాశం జిల్లా టీడీప శ్రేణులు జోష్ మీదున్నాయి. ఆల్ టైం రికార్డులు సృష్టించిన ఈ సభతో వచ్చే ఎన్నికల్లో తాము ముందే గెలిచినట్లుగా భావిస్తున్నారు. ఎన్నో ఇబ్బందులను అధిగమించి టీడీపీ కార్యకర్తలు లక్షల సంఖ్యలో సభకు హాజరు కావటం టీడీపీ నేతలకు కొత్త ఉత్యాహాన్నిచ్చింది. అయితే వైసీపీ నేతలు మాత్రం టీడీపీ నేతలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని..…
మహానాడు రెండో రోజున భారీ బహిరంగ సభ జరగనుంది. వివిధ జిల్లాల నుంచి బహిరంగ సభకు తరలి వస్తున్నారు టీడీపీ కార్యకర్తలు. బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు వస్తారని టీడీపీ అంచనా వేసింది. ఏపీలోని అన్ని జిల్లాల నుంచి కార్లు, ట్రాక్టర్లు, వివిధ వాహనాల్లో టీడీపీ నేతలు, కార్యకర్తలు వస్తుండడంతో ఒంగోలుకి వచ్చే దారులన్నీ పసుపుమయంగా మారాయి.