ఏపీ రాజకీయాలు కాకరేపుతూనే వున్నాయి. ప్రకాశం జిల్లా కొండపి టీడీపీ ఎమ్మెల్యే బాలవీరాంజనేయ స్వామి ఇంటి ముట్టడికి వైసీపీ నేత అశోక్ బాబు ప్రయత్నించడం ఉద్రిక్తతకి దారి తీసింది. ఎమ్మెల్యే స్వామి ఇంటికి కార్యకర్తలతో వెళ్తున్న వైసీపీ నాయకుడు అశోక్ బాబుని పోలీసులు అడ్డుకున్నారు. అయితే పోలీసులను నెట్టుకుంటూ ముందుకు వెళ్లేందుకు అశోక్ బాబు ప్రయత్నించాడు. దీంతో పోలీసులు, వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. దీంతో 16వ నెంబరు జాతీయ రహదారిపై కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం…