మహానాడు ఈ రోజు కీలక ఘట్టానికి వేదిక కానుంది.. టీడీపీ జాతీయ అధ్యక్ష పదవికి నేడు నామినేషన్లు దాఖలు చేయనున్నారు.. ఆ తర్వాత మధ్యాహ్నం జాతీయ అధ్యక్షుడు ఎన్నిక జరగనుంది.. సాయంత్రం నూతనంగా ఎన్నికైన జాతీయ అధ్యక్షుని చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.. టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. మరోసారి నామినేషన్ దాఖలు చేయనున్నారని తెలుస్తోంది
కడప జిల్లాలో టీడీపీ మహానాడు ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్ర అభివృద్ధి, కార్యకర్తల సంక్షేమం అనే అజెండాతో మొదటి రోజు మహానాడులో తీర్మానం ప్రవేశపెట్టారు. ఆరు ప్రధాన అంశాలను సభ ముందు ఉంచారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగం కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపింది.
మహానాడు ఒక చారిత్రక రాజకీయ వేడుక అంటూ ఎక్స్ (ట్విట్టర్)లో పోస్టు పెట్టారు పవన్ కల్యాణ్.. "మహానాడు... ఈ పదం విన్నా, చదివినా వెంటనే గుర్తుకు వచ్చేది ‘తెలుగు దేశం’ పార్టీనే. అంతలా తెలుగువారి గుండెల్లో స్థిరపడిపోయింది ఏటా జరిగే మహానాడు వేడుక. రాయలసీమ గడ్డపై.. కడపలో అంగరంగ వైభవంగా మహానాడు చారిత్రక రాజకీయ పండుగ నేడు ప్రారంభమైన శుభవేళ నా పక్షాన, జనసేన పార్టీ పక్షాన తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, విద్యాశాఖా…
మీడియాతో నారా లోకేశ్ చిట్‍చాట్‌లో తదుపరి సీఎం మీరేగా అన్న మీడియా ప్రశ్నకు లోకేశ్ సమాధానమిస్తూ.. ముఖ్యమంత్రి పదవికి అంత తొందరేముంది? అని ప్రశ్నించారు.. సీఎం చంద్రబాబు యంగ్ అండ్ డైనమిక్ నాయకులు.. ఆయన ఇంకా యువ నాయకుడే అని అభివర్ణించారు.. దేశానికి ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం చాలా అవసరం.. ప్రజలకు సేవ చేసేందుకు పదవితో సంబంధం లేదన్నారు నారా లోకేష్..
మహానాడు వేదికగా టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు టీడీపీపై విరాళాల వర్షం కురిసింది.. కేవలం రెండు గంటల వ్యవధిలోనే 17 కోట్లకు పైగా విరాళాలు వచ్చినట్టు టీడీపీ ప్రకటించింది.. పార్టీ తరపున సేకరించిన విరాళాలు పార్టీ కోసమే కాకుండా, పేదలు, పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం ఖర్చు చేస్తామని వెల్లడించారు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
కడపలో టీడీపీ మహానాడు అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు మహానాడు ప్రాంగణంలో తన పేరును రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ప్రాంగణంలో మహానాడు కిట్టును సీఎం కొనుగోలు చేశారు. ఆపై ఫొటో ప్రదర్శనను తిలకించారు. మహానాడు ప్రాంగణంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. రక్తదాన శిబిరాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. Also Read: Gold Rate Today: మళ్లీ షాకిచ్చిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందంటే? మహానాడు ప్రాంగణంలోని…
టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద పండగగా భావించే ‘మహానాడు’ నేటి నుంచి కడప జిల్లాలో అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘన విజయం తర్వాత జరుగుతున్న తొలి మహానాడును మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కడప మొత్తం పసుపు జెండాలు, పచ్చని తోరణాలతో పసుపు మయం అయింది. మహానాడులో పాల్గొనేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలి రానున్నారు. ప్రస్తుతం…
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోటలో మహానాడు నిర్వహణకు పనులు మొదలు పెట్టింది తెలుగుదేశం పార్టీ.. గతంలో ఎన్నడూ లేని విధంగా పదికి ఏడు స్థానాల్లో గెలిచి వైసీపీకి షాక్ ఇచ్చింది. టీడీపీ ఆవిర్భావం తర్వాత మొట్టమొదటిసారిగా అక్కడ మహానాడు నిర్వహించి తన బల నిరూపణకు సిద్ద మవుతోంది టీడీపీ.. రాయలసీమపై టీడీపీ గురిపెట్టిందా ? అక్కడే మహానాడు నిర్వహణకు టీడీపీ పన్నుతున్న వ్యూహం ఏమిటి ? అనేది ఇప్పుడు చర్చగా మారింది..