రైతులకు ధాన్యం డబ్బులు వెంటనే చెల్లించాలని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మిగిలి ఉన్న ధాన్యాన్ని వెంటనే గిట్టుబాటు ధరకు సేకరించాలని ఆయన సర్కారును కోరారు. ప్రభుత్వ మొండి వైఖరి నశించాలంటూ రైతులతో కలిసి పెనమలూరు నియోజకవర్గంలో ఆయన నిరసన చేపట్టారు.