ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నేతలు ప్రచార జోరును పెంచారు. విజయవాడ పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కేశినేని నాని ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇవాళ విజయవాడ సెంట్రల్, జగ్గయ్యపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులతో కలిసి ఆయన ప్రచారం నిర్వహించారు.
న్డీఏ కూటమి మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ-జనసేన మేనిఫెస్టోపై మోడీ ఫొటో పెట్టవద్దని ఢిల్లీ నుంచి వాళ్లకు ఫోన్ వచ్చిందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ముగ్గురు కూటమిలో ఉండి.. ముగ్గురి ఫోటోలను మేనిఫెస్టోలో పెట్టుకునే పరిస్థితి చంద్రబాబుకు లేదన్నారు.
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోను విడుదల చేసింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి ఉమ్మడి మేనిఫెస్టోను మూడు పార్టీల నేతలు ఆవిష్కరించారు. ఉమ్మడి మేనిఫెస్టో చంద్రబాబు, పవన్ కల్యాణ్, సిద్జార్థ్ నాథ్ సింగ్‌లు విడుదల చేశారు.