ఒకప్పుడు ఆ నియోజకవర్గంలో ఆమె చెప్పిందే వేదం. ప్రస్తుతం మౌనంగా ఉంటున్నారు. రాజకీయాలే వద్దనుకున్నారో.. లేక పరిస్థితులు బాగోలేక కామ్ అయ్యారో ఏమో.. ఉలుకు లేదు పలుకు లేదు. కేడర్ సైతం పక్క చూపులు చేసే పరిస్థితి. ఇంతకీ ఆమె మౌనం దేనికి సంకేతం? ఉపఎన్నిక వేళ జరుగుతున్న చర్చ ఏంటి? రెండేళ్లుగా టీడీపీ నేత విజయమ్మ మౌనం! కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీకి త్వరలో ఉపఎన్నిక జరగనుంది. ఈపాటికే పోలింగ్ జరగాల్సి ఉన్నా.. కరోనా ఉద్ధృతి…