ఈ రోజు టీడీపీ - బీజేపీ - జనసేన పార్టీల ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు చంద్రబాబు నివాసంలో మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ ముఖ్య నేతల సమక్షంలో మేనిఫెస్టో విడుదల కానుంది.
ఇవాళ ఉదయం 11 గంటలకు కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్ ( Gajendra singh Shekawat )తో చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan kalyan ) సమావేశం కానున్నారు. ఈ భేటీలో సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఖరారుపై తీవ్ర కసరత్తులు చేసే అవకాశం ఉంది.
రేపు టీడీపీ - బీజేపీ - జనసేన పార్టీల ఉమ్మడి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి టీడీపీ అధినేత చంద్రబాబు హాజరుకానున్నారు. అందుకోసమని.. రేపు ఉదయం హైదరాబాదు నుంచి రానున్నారు. రేపు ఉదయం 11 గంటలకు కేంద్ర మంత్రి షెకావత్, చంద్రబాబు, పవన్ ఉమ్మడి సమావేశం జరగనుంది. సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఖరారుపై కసరత్తులు చేయనున్నారు. రేపటి మూడు పార్టీల అగ్ర నేతల భేటీలో ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి పాల్గొననున్నారు.
టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తులపై మంత్రి అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అందరూ కలిస్తే తప్ప పోటీ ఇవ్వలేమని తెలిసి రాజకీయ పార్టీలు అన్నీ ఏకం అయ్యాయని విమర్శించారు. చంద్రబాబుకు పొత్తులు కొత్త కాదని దుయ్యబట్టారు. మేలు చూసి ఓటేయమని ముఖ్యమంత్రి అడుగుతుంటే.. పొత్తు చూసి ఓటేయమని చంద్రబాబు అడుగుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్. KA పాల్ తప్ప అందరితోనూ పొత్తులు పెట్టుకున్న చరిత్ర చంద్రబాబుదని విమర్శించారు.