నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో జయభేరి మోగించి ఫుల్ జోష్‌తో ఉన్న కమలనాథులకు షాకిచ్చే కామెంట్ చేశారు పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ. అప్పుడే ఆట ముగిసిపోలేదని.. మున్ముందు రాష్ట్రపతి ఎన్నికలు ఉన్నాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని చురకలు అంటించారు. దేశంలోని మొత్తం ఎమ్మెల్యేలలో సగం మంది కూడా లేని బీజేపీకి ఈ ఎన్నిక అంత ఈజీ కాదన్నారు. ప్రతిపక్ష పార్టీలకే దేశవ్యాప్తంగా ఎక్కువ మంది ఎమ్మెల్యేలున్నారని చెప్పుకొచ్చారు మమత. యూపీ ఎన్నికల్లో ఓడిపోయిన ఎస్పీ వంటి…