నైజీరియాలో మహిళా ఆత్మాహుతి బాంబర్లు బీభత్సం సృష్టించారు. పెళ్లి, అంత్యక్రియలు, ఆస్పత్రిని లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడ్డారు. దీంతో 32 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈశాన్య నైజీరియా పట్టణంలోని గ్వోజాలో వారాంతంలో జరిగిన పలు ఆత్మాహుతి బాంబు దాడుల్లో మరణించిన వారి సంఖ్య 32కి చేరిందని, 42 మంది గాయపడినట్లు ఆ దేశ ఉపాధ్యక్షుడు కాశీం శెట్టిమా సోమవారం తెలిపారు.