ICC Punishes Tanzim Hasan: బంగ్లాదేశ్ పేసర్ తంజీమ్ సకీబ్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ సకిబ్‌పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కొరడా ఝుళిపించింది. మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించడమే కాకూండా.. అతడి ఖాతాలో ఓ డీమెరిట్ చేర్చింది. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా కింగ్స్‌టౌన్ వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో నేపాల్ కెప్టెన్ రోహిత్ పౌడెల్‌తో గొడవకు దిగిన కారణంగా సకిబ్‌పై ఐసీసీ జరిమానా విధించింది. మూడో ఓవర్…