(జూలై 14న తనికెళ్ళ భరణి పుట్టినరోజు) నేడు నటునిగా తనదైన బాణీ పలికిస్తూ అందరినీ అలరిస్తోన్న తనికెళ్ళ భరణి కలం బలం తెలియాలంటే ఓ మూడు దశాబ్దాలు పైగా వెనక్కి వెళ్ళాలి. జనబాహుళ్యంలో ఉన్న పదాలతో పసందైన సంభాషణలు రాసి ఆకట్టుకున్నారు భరణి. ఇక నటనలో అడుగు పెట్టాక, తనకు లభించిన ప్రతి పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయాలనే తపించారు. ఇప్పటికీ ఆ తపనతోనే సాగుతున్నారాయన. అందుకే భరణి అభినయం జనానికి మొహం మొత్తలేదు. ఆయన కామెడీ…