కేంద్రం ప్రభుత్వ ఆస్తులను విక్రయించడం లేదా లీజుకు ఇవ్వడం వంటివి చేయడం మంచిది కాదని దీనిపై ప్రధాని మోడికీ లేఖ రాస్తానని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పేర్కొన్నారు. కేంద్రం అనుసరిస్తున్న నేషనల్ మానిటైజేషన్ పైపులైన్ విధానంపై ఆయన ఈరోజు విమర్శలు చేశారు. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలు ప్రజా ఆస్తులని, అవి దేశ భవిష్యత్తుకు, ఆర్థిక వృద్ధికి, ఉద్యోగాల కల్పన కోసం ఏర్పాటు చేశారని, వాటిని అమ్మడం లేదా లీజుకు ఇవ్వడం వంటిది దేశప్రయోజనాలకు మంచిది కాదని…
కోలీవుడ్ సీనియర్ నటుడు, డీఎండీకే పార్టీ అధినేత కెప్టెన్ విజయ్‌కాంత్ ఆరోగ్య పరిస్థితి ఇబ్బందిగా ఉన్నట్టు తెలుస్తోంది. అత్యవసర వైద్య చికిత్స కోసం ఆయన చెన్నై నుంచి దుబాయ్ వెళ్లారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని బట్టి అక్కడ నుంచి అమెరికా కూడా తీసుకెళ్తారని సమాచారం. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు విజయ్‌కాంత్. గత ఏడాది ఆయన కరోనా మహమ్మారి బారినపడ్డారు. ఆ తర్వాత చికిత్స తీసుకుని కోలుకున్నారు. కానీ, ఆ తర్వాత మళ్లీ ఆయనను అనారోగ్య…
తమిళనాడు బీజేపీ నేత వీడియో కాల్ చాటింగ్ కలకలం రేపుతున్నది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేటీ రాఘవన్ పార్టీ సభ్యురాలితో అసభ్యకరంగా వీడియో కాల్ చాటింగ్ చేస్తున్న వీడియో బయటకు వచ్చింది. దీంతో అక్కడ పెద్ద దుమారం రేగింది. ఈ వీడియో బయటకు రావడంతో బీజేపీ పార్టీ ప్రధాన కార్యదర్శి కేటీ రాఘవన్ తన పదవికి రాజీనామా చేశారు. మహిళలతో అసభ్యంగా విడీయో కాల్ మాట్లాడిని రాఘవన్‌పై కాంగ్రెస్ ఎంపీ జ్యోతిమణీ రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు…
సాధారణంగా ఒక కుటుంబానికి సరిపడా వంట చేయడానికి కనీసం గంట నుంచి గంటన్నర సమయం పడుదుంది. ఇక, పండగలు, పర్వదినాలకు వంట చేయాలంటే కనీసం మూడు గంటల సమయం పడుతుంది. అయితే, తమిళనాడులోని మధురై జిల్లాకు చెందిన ఇందిరా రవిచంద్రన్ అత్యంత వేగంగా 30 నిమిషాల్లోనే 134 రకాల వంటలు చేసి రికార్డ్ సృష్టించింది. ఇందులో ఇడ్లీ, దోశలతో పాటు అనేక రకాల వెజ్, నాన్ వెజ్ వంటకాలు ఉన్నాయి. తక్కువ సమయంలో ఎక్కువ రకాల వంటలు…
తమిళనాడులో డిఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత స్టాలిన్ పేరు మారుమ్రోగిపోతున్నది. గతంలో స్టాలిన్ చెన్నై మేయర్‌గా పనిచేసిన రోజుల్లో చాలా ఉత్సాహంగా, ఫిట్‌గా కనిపించేవారు. నిత్యం ప్రజల్లోకి వెళ్లి వాళ్ల సమస్యలపై చర్చించేవారు. ఆ తరువాత ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లో కూడా ఆయన తన దినచర్యలో ఎలాంటి మార్పులు చేయలేదు. నిత్యం యోగా, సైక్లింగ్, జిమ్ చేయడం తప్పనిసరి. 68 ఏళ్ల వయసులో స్టాలిన్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఆయన తన…
డబ్బుల కోసం ఓ కొడుకు దారుణానికి ఒడిగట్టాడు. కన్నతల్లి అని చూడకుండా ఆమెపై దాడిచేశాడు. తీవ్రంగా గాయపరిచాడు. ఈ సంఘటన తమిళనాడులోని నమ్మక్కల్ జిల్లాలో చోటుచేసుకుంది. నమ్మక్కల్ జిల్లాలోని పొన్నేరిపట్టిలో నివశించే షణ్ముగం అనే వ్యక్తి డబ్బుల కోసం తల్లిపై దాడి చేశాడు. రోడ్డుపై ఈడ్చుకుంటూ తీసుకెళ్లి దారుణంగా కొట్టాడు. ఈ దాడిలో ఆమెకు తీవ్రమైన గాయాలయ్యాయి. గతంలో ఆ తల్లి కుమారుడికి తన పొలం రాసిచ్చింది. అయితే, ఇప్పుడు పొదుపు స్కీంలో దాచుకున్న రూ.3 లక్షలు…
తమిళనాడులో గత అన్నాడీఎంకే ప్రభుత్వం పదేళ్లలో పెద్ద మొత్తంలో అప్పులు చేసిందని, సాంకేతికంగా ధనిక రాష్ట్రమైన తమిళనాడులోని మౌళిక వసతుల వినియోగంపై గత ప్రభుత్వం దృష్టిసారించలేకపోయిందని, ఫలితంగా లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిందని ఆ రాష్ట్ర ఆర్ధికశాఖ మంత్రి త్యాగరాజన్ పేర్కొన్నారు. గత ఐదేళ్లలో 3 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసిన అన్నాడీఎంకే ప్రభుత్వం అందులో 50 శాతం నిధులను రోజువారీ ఖర్చులకు వినియోగించడం వలన రెవిన్యూలోటుగా మారిందని అన్నారు. రాష్ట్రంలోని 2.16 కోట్ల…
విశ్వాసానికి ప్రతీక శునకం. ఒక్కరోజు దానికి ఆహారం పెడితే చాలు… ఎంతో విశ్వాసాన్ని చూపుతుంటాయి. ఇక కొన్ని శునకాలు యజమాలను చెప్పిన విధంగా ఉంటూ అన్ని పనుచు చేస్తుంటాయి. అన్నింటిలోకి ఈ శునకం వేరు అంటున్నారు దాస్ ఫెర్నాండేజ్. తమిళనాడులోని దిండిగల్ జిల్లా పళనికి చెందిన దాస్ ఫెర్నాండేజ్ లాబ్రడార్ జాతికి చెందిన శునకాన్ని పెంచుతున్నాడు. దానికి బయటకు వెళ్లి సరుకులు ఎలా తీసుకురావాలో నేర్పించాడు. యజమాని చీటీ రాసి బుట్టను మెడకు తగిలించి పంపిస్తే చాలు……