ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ గేమ్‌లను నిషేధించే బిల్లును తమిళనాడు న్యాయశాఖ మంత్రి ఎస్ రేగుపతి బుధవారం రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. నివేదికల ప్రకారం.. రమ్మీ, పోకర్‌తో సహా ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ ప్లాట్‌ఫారమ్‌లను నిషేధించడానికి బిల్లు ప్రవేశపెట్టబడింది.
తమిళనాడు ప్రభుత్వం, ఆలయాల నిర్వాహకుల మధ్య వివాదం చినికి చినికి గాలివాన చందంగా మారుతోంది. నేడు ఆస్తుల లెక్కపై దీక్షితుల వైఖరి పై ఉత్కంఠ నెలకొంది. తమిళనాడులో దీక్షితుల నిర్వహణలో వందలాది ఆలయాలున్నాయి. చిదంబరం ఆలయాల్లో దీక్షితులదే నిర్వహణ బాధ్యత. అయితే, ఇప్పటివరకు జోక్యం చేసుకోలేదు దేవాదాయ శాఖ. తాజాగా అధీనాలు, దీక్షితుల ఆధ్వర్యంలో ఉన్న ఆలయ ఆస్తుల లెక్కించాలని స్టాలిన్ ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడం వివాదానికి కారణం అవుతోంది. ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు అధీనాధిపతులు,…
బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న కేసీఆర్.. మళ్లీ రాష్ట్రాల పర్యటన మొదలుపెట్టనున్నారు. ఈనెల 20న ముంబై వెళ్లి మహారాష్ట్ర సీఎంతో సమావేశం కానున్నారు. త్వరలో బీజేపీయేతర సీఎంల సమావేశం సన్నాహాలు జరుగుతుండగా.. మాజీ ప్రధాని దేవెగౌడను కూడా భేటీకానున్నారు. మహారాష్ట్ర సియం ఉద్దవ్ థాకరే టిఆర్ఎస్ అధినేత కేసియార్‌కు ఫోన్ చేశారు. ఈనెల 20న ముంబై రావాలని ఆహ్వానించారు. బిజెపికి వ్యతరేకంగా కేసియార్ చేస్తున్న పోరాటానికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఫెడరల్ స్ఫూర్తి కోసం ప్రజా వ్యతిరేక విధానాలను…
తమిళనాడులోని కూనూరు సమీపంలో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ దుర్ఘటన పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో మరణించిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి, ఆర్మీ అధికారులకు సంతాపం వ్యక్తం చేశారు బండి సంజయ్. మాతృభూమి రక్షణ కోసం రావత్ చేసిన సేవలు ఎనలేనివన్నారు బండి సంజయ్. రావత్ మరణం దేశానికి తీరని లోటన్నారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు…
ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్ పై తమిళనాడు ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా నుంచి కోలుకున్న వెంటనే ఓ షోలో పాల్గొనడంపై ఫైర్ అవుతూ నోటీసులు జారీ చేసింది. కమల్ హాసన్ కు నవంబర్ 22న కరోనా పాజిటివ్ అని తేలిన విషయం తెలిసిందే. కమల్ హాసన్ స్వయంగా తనకు కోవిడ్ -19 సోకింది అంటూ ట్వీట్ చేశారు. దీంతో ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. యూఎస్…
తమిళనాడులో కరోనా విజృంభనపై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఎం ఆర్ విజయభాస్కర్ వేసిన పిటిషన్ పై విచారణ జరిపింది హైకోర్టు. అయితే ఎన్నికల కౌంటింగ్ లో కోవిడ్ నిబంధనలు పాటించడం లేదంటూ పిటిషన్ వేశారు విజయభాస్కర్. ఈ పిటిషన్ విచారణ సమయంలోనే మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. కరోనా సెకండ్ వేవ్ కి ఎన్నికల కమిషన్ కారణం అన్న హైకోర్టు… అధికారులపై మర్డర్ కేసు పెట్టాలని ఆదేశించింది.…