గత నెల క్రితం వర్షాలతో అతలాకుతలమైన తమిళనాడులో మరోసారి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీవర్షాలతో పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. చెన్నై, కాంచీపురం తిరువళ్లూరు, చింగ్లెపేట్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది. భారీ వర్షాల నేపథ్యంలో చైన్నైలో ఫ్లడ్ కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. అయితే ఈ ఫ్లడ్ కంట్రోల్ రూమ్‌ను సీఎం స్టాలిన్…
తమిళనాడులో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత 15 రోజుల నుంచి తమిళనాడులో తగ్గేదేలే అన్నట్లుగా వరుణుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. దీంతో చెన్నై సహా 23 జిల్లాలోని స్కూల్స్ కాలేజీలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. నిన్న రాత్రి నుంచి చెన్నైలో మరోసారి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. Also Read : అండమాన్‌లో అలజడి.. మరోసారి ఏపీకి భారీ వర్షసూచన.. అంతేకాకుండా మెరీనా…
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడి అల్పపీడనం వాయుగుండంగా మారి చెన్నైపై తన ప్రభావాన్ని చూపెడుతోంది. ఇప్పటికీ 10 రోజుల నుంచి ఎడతెరపిలేకుండా వర్షాలు కురియడంతో తమిళనాడులోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షితమైన ప్రాంతాలకు తరలించేందుకు సీఎం ఎంకే స్టాలిన్ చర్యలు తీసుకున్నారు. అంతేకాకుండా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగిన సంప్రదించాలని సూచిస్తూ.. కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. అయితే కొన్ని ప్రాంతాల్లో ఇంట్లోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర అవస్థలు…
ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో తమిళనాడు రాష్ట్రం తడిసి ముద్దయింది. లోతట్టు ప్రాంతాల్లో వర్షపునీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికీ వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించారు. అంతేకాకుండా ఆహార పంపిణీతో పాటు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ఈ మేరకు మంగళవారం సీఎం ఎంకే స్టాలిన్ ఆహార పంపిణీని పరిశీలించారు. వర్షాలు తగ్గేవరకు అమ్మక్యాంటీన్ల ద్వారా ఉచిత ఆహారం అందిస్తామని వెల్లడించారు.