ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో తమిళనాడు రాష్ట్రం తడిసి ముద్దయింది. లోతట్టు ప్రాంతాల్లో వర్షపునీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికీ వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించారు.
అంతేకాకుండా ఆహార పంపిణీతో పాటు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ఈ మేరకు మంగళవారం సీఎం ఎంకే స్టాలిన్ ఆహార పంపిణీని పరిశీలించారు. వర్షాలు తగ్గేవరకు అమ్మక్యాంటీన్ల ద్వారా ఉచిత ఆహారం అందిస్తామని వెల్లడించారు.