తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీది మయం వ్యవస్థాపకుడు కమల్ హాసన్ తమిళనాడు కోయంబత్తూర్ నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. కమల్ హాసన్ ఓట్ల లెక్కింపు ప్రారంభంలోనే ముందున్నప్పటికీ.. చివర్లో స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఆయనపై బీజేపీ అభ్యర్థి వనతి శ్రీనివాసన్ విజయం సాధించారు. కాగా కమల్ ఓటమి అనంతరం ఆయన కూతురు నటి శ్రుతి హాసన్ ఇన్‌స్టాగ్రామ్‌లో తన తండ్రి ఫొటోను షేర్ చేసింది. ‘మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది నాన్న’ అంటూ…
మన దేశంలో రాజకీయ, సినిమా రంగం జమిలిగా కొన్ని దశాబ్దాలుగా ప్రయాణం సాగిస్తున్నాయి. చిత్రసీమకు చెందిన ఎంజీఆర్, ఎన్టీయార్, జయలలిత, కరుణానిధి వంటి ప్రముఖులు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా రాణించారు. మరెందరో సినీ ప్రముఖులు ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలలో మంత్రులుగానూ పనిచేశారు. మరెందరో సొంత పార్టీలూ పెట్టారు. అయితే… సోమవారం వచ్చిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో సినీ తారలకు మాత్రం ఓట్లరు చుక్కులు చూపించారు. మరీ ముఖ్యంగా తమిళనాట ‘మక్కల్ నీది కయ్యం’…