పార్టీ అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ 70వ జన్మదిన వేడుకలను మార్చి 1న అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అధికార డీఎంకే సన్నాహాలు చేస్తోంది. నవజాత శిశువులకు బంగారు ఉంగరాల బహుమతి, సంక్షేమ కార్యక్రమాలు, ప్రజలకు అన్నదానం వంటి పలు కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.
కేంద్ర విద్యాసంస్థల్లో హిందీని బోధనా మాధ్యమంగా మార్చాలని పార్లమెంటరీ కమిటీ చేసిన సిఫార్సులకు వ్యతిరేకంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి తమిళనాడులో పర్యటించారు. చెన్నైలో తన క్యాంప్ ఆఫీస్‌లో తిరు కె.చంద్రశేఖర్ రావు మంత్రి కేటీఆర్‌తో కలిసి తనను మర్యాదపూర్వకంగా కలిశారని, అద్భుత సమయాన్ని తనతో గడిపారని ట్వీట్ చేశారు తమిళనాడు సీఎం స్టాలిన్. కేసీఆర్ పర్యటనపై ఆనందం వ్యక్తం చేశారు.ఈ భేటీలో ఇద్దరు సీఎంలు కాంగ్రెస్, బీజేపీయేతర కూటమిపై చర్చించినట్టుగా తెలుస్తోంది. READ ALSO తమిళ సీఎం స్టాలిన్‌తో కేసీఆర్ భేటీ
తమిళనాడు సీఎం స్టాలిన్ నివాసానికి చేరుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఆయనతో సమావేశం నిర్వహిస్తున్నారు. దేశంలో నెలకొన్న తాజా పరిణామాలపై చర్చించారు.కేసీఆర్ వెంట మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్ కుమార్, కుటుంబసభ్యులతో స్టాలిన్ ఇంటికి వెళ్ళారు సీఎం కేసీఆర్. కాంగ్రెస్, బీజేపీయేతర కూటమి ఏర్పాటుపై చర్చించారు. యాదాద్రి ప్రారంభానికి స్టాలిన్‌ను ఆహ్వానించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం కుటుంబ సమేతంగా తమిళనాడుకు సీఎం కేసీఆర్ వెళ్ళారు. సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో సీఎంతోపాటు ఆయన…
ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో తమిళనాడు రాష్ట్రం తడిసి ముద్దయింది. లోతట్టు ప్రాంతాల్లో వర్షపునీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికీ వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించారు. అంతేకాకుండా ఆహార పంపిణీతో పాటు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ఈ మేరకు మంగళవారం సీఎం ఎంకే స్టాలిన్ ఆహార పంపిణీని పరిశీలించారు. వర్షాలు తగ్గేవరకు అమ్మక్యాంటీన్ల ద్వారా ఉచిత ఆహారం అందిస్తామని వెల్లడించారు.
తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఎం.కే స్టాలిన్ అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా ముందుకు వెళుతున్నారు. ఆ మధ్య అర్థరాత్రి ఓ పోలీస్ స్టేషన్ ను సందర్శించిన సీఎం స్టాలిన్, ఇటీవల ఓ ఆర్టీసీ బస్సులో ప్రయాణించి అందరినీ అవాక్ చేశారు. అంతేకాకుండా మొన్నటికి మొన్న రోడ్డుపై తన కాన్వాయ్ వెళ్తుండగా వెనుకనుంచి వస్తున్న అంబులెన్స్‌కు సైడ్ ఇచ్చి తన మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. ఇలా ఊహించని రీతిలో తనదైన శైలితో సీఎం స్టాలిన్ ముందుకు…
కోలీవుడ్ స్టార్ హీరో నటించిన తాజా చిత్రం “జై భీమ్”. జ్ఞానవేల్ రాజా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ముఖ్యమంత్రి నుంచి సామాన్యుల వరకు అందరిని ఫిదా చేసేస్తోంది. నవంబర్ 2న అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో సమాజంలో అణగారిన వర్గాలపై చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని కొందరు పెద్ద మనుషులు చేస్తున్న దారుణమైన పనుల గురించి చూపించారు. మంచి సామాజిక…
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పై జనసేనాని పవన్కళ్యాణ్ అభినందనల వర్షం కురిపించారు. ముఖ్యమంత్రి అయ్యాక ఆయన తీసుకుంటున్న చర్యలు అందరికీ ఆదర్శప్రాయంగా మారాయి. ఇటీవల కాలంలో ఆయన చేసిన కామెంట్స్ లో అసెంబ్లీలో ఎవరికైనా పొగిడే ఉద్దేశం ఉంటే మానుకోవాలని, అలాంటి ఎమ్మెల్యేల విషయంలో కఠినంగా వ్యవహరిస్తానని చెప్పారు. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే బ్యాగుల పై రాజకీయ ప్రత్యర్థుల ఫోటోలు ఉండగా, అలాగే పంపిణీ చేయాలని ఆదేశించారు. బ్యాగులపై ఫోటోలు మార్చడానికి చాలా ఖర్చు అవుతుందని,…