Bus Accident: తమిళనాడులోని కడలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొన్న ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మరణించారు. 70 మంది గాయపడ్డారు. కడలూరు జిల్లా నెల్లికుప్పం సమీపంలోని పట్టంబాక్కం వద్ద జరిగిన ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. కడలూరు-పన్రుటి మధ్య రెండు ప్రైవేట్ బస్సులు వెళ్తున్నాయి. ఒక బస్సు ముందు టైరు పగిలిపోవడంతో అదుపు తప్పి ఎదురుగా వస్తున్న మరో బస్సును ఢీకొట్టింది.
Also Read: VIDEO : మత్తులో పోలీసులపై దాడి చేసిన గంజాయి బ్యాచ్
అంబులెన్స్‌లు వచ్చేలోపే ప్రయాణికులు క్షతగాత్రులను కడలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, చికిత్స పొందుతున్న వారికి రూ.50,000 చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.