కనివిని ఎరుగని రీతిలో జలప్రళయం ముంచుకొచ్చింది. తమిళనాడుతో పాటు ఏపీలోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే ఏపీలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. చైన్నైకి ఆగ్నేయ దిశగా 150 కిలోమీటర్ల వద్ద వాయుగుండం కేంద్రీకృతమైంది. పశ్చిమ వాయువ్య దిశగా గంటకు 18 కిలోమీటర్ల వేగంతో వాయుగుండం కదులుతున్నట్లు అధికారులు వెల్లడించారు. Also Read : వరద నీటిలో కొట్టుకుపోయిన నలుగురు మహిళలు ఈ రోజు తెల్లవారుజామున 3-4 గంటల మధ్య చెన్నై-పుదుచ్చేరి మధ్య వాయుగుండం…
బంగాళఖాతంలో ఏర్పడిన వాయుగుండ చైన్నైలో తీరం దాటింది. ఇప్పటికే వాయుగుండం ప్రభావంతో ఏపీ, తమిళనాడులో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆయా రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని అధికారులను, ప్రజలను సూచించింది. తీర ప్రాంతాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. దీంతో విమానాలను హైదరాబాద్, ముంబై, కోల్‌కత్తాలకు మళ్లిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా తమిళనాడులో 14 మంది మృతి చెందారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అధికారులు…