ఐ-బొమ్మ అనే పైరసీ సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్న సంగతి తెలిసిందే. అతని మీద పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. స్వయంగా అతని చేతనే పోలీసులు ఐ-బొమ్మ వెబ్‌సైట్‌లను బ్లాక్ చేయించారు. అయితే, ఇప్పుడు తెరమీదకు కొత్తగా ఐ-బొమ్మ 1 అనే ఒక వెబ్‌సైట్ వచ్చింది. ఐ-బొమ్మ కోసం వెతుకుతున్న వారికి ఈ ఐ-బొమ్మ 1 ఇప్పుడు దర్శనమిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వెబ్‌సైట్ ఎవరిది అనే చర్చ నడుస్తోంది.…
చిత్రపరిశ్రమను చిరకాలంగా వేధిస్తున్న సమస్యలలో పైరసీ ఒకటి. గతంలో సినిమాలు నెలలు, వందల రోజులు ఆడేవి. అయితే పైరసీ భూతం ఎంటరైన తర్వాత కాలక్రమేణా సినిమా రన్ పడిపోయింది.