మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన తమిళనాడు అటవీ శాఖ మంత్రి కె.పొన్ముడిపై చర్యలు తీసుకోవాలని మద్రాస్ హైకోర్టు సూచించింది. వెంటనే మంత్రిపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. లేనిపక్షంలో కోర్టు ధిక్కార చర్యగా పరిగణిస్తామని హెచ్చరించింది. జస్టిస్ ఎన్.ఆనంద్ వెంకటేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కేసును ఏప్రిల్ 23కి వాయిదా వేశారు.
తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్ బాధ్యతలు చేపట్టబోతున్నారంటూ మరోసారి ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఎప్పటి నుంచో డీఎంకేలో ఈ ప్రచారం జరుగుతోంది. తాజాగా మరోసారి ఈ ప్రస్తావన రావడంతో మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) కోశాధికారి మరియు ఎంపీ టీఆర్ బాలు, డీఎంకే యువజన విభాగం అధినేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌కు హెచ్చరిక నోట్ జారీ చేశారు. తన రాజకీయ జీవితంలో జాగ్రత్తగా అడుగులు వేయాలని కోరారు.
అక్రమ ఇసుక మైనింగ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసుకు సంబంధించి తమిళనాడు విద్యాశాఖ మంత్రి కె. పొన్ముడి, ఆయన కుమారుడి ఫిక్స్‌డ్ డిపాజిట్లలో ఉన్న రూ.41.9 కోట్ల విలువైన ఆస్తులను స్తంభింపజేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంగళవారం తెలిపింది.
తమిళనాడులో అధికార డీఎంకే పార్టీ నేతలు వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం కూర్చోవడానికి కుర్చీ తీసుకురాలేదని పార్టీ కార్యకర్తలపై మంత్రి ఎస్‌ఎం నాజర్ రాయి విసిరిన సంగతి తెలిసిందే.