పీకే7 స్టూడియోస్ సమర్పణలో డాక్టర్ ప్రగభల్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం జాకీ. తాజాగా జాకీకి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల అయింది. వినుత్నమైన కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో గోట్స్ ఫైట్ ఆసక్తికరంగా ఉండబోతుందని అర్థం అవుతుంది. ముఖ్యంగా మదురైలో సాంప్రదాయంగా కొనసాగుతున్న ఈ గోట్ ఫైట్ చుట్టు అల్లుకున్న కథ అని తెలుస్తుంది. కేవలం ఫైట్స్ మాత్రమే కాదు అద్భుతమైన భావోద్వేగాలతో ప్రేక్షకులను కట్టిపడేసేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు ఫస్ట్ లుక్ చూస్తుంటే అర్థం అవుతుంది.…
పార్లమెంట్ లో రాజదండం(సెంగోల్) ఉంచడంపై మళ్లీ దుమారం రేగుతోంది. ఇటీవల సమాజ్‌వాదీ పార్టీ సభ్యుడు ఆర్కే చౌదరి చేసిన వ్యాఖ్యలు దీనికి కారణం అయ్యాయి. పార్లమెంటు నుంచి రాజదండం తొలగించాలంటూ ఆయన రాసిన లేఖకు బీజేపీ బదులిచ్చింది. ఇదిలా ఉండగా.. దీనిపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దీనిపై మండిపడ్డారు. భారతీయ చరిత్రను, తమిళ సంస్కృతిని సమాజ్‌వాదీ పార్టీ, ఇండియా కూటమి అగౌరవపరుస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
చెన్నై విమానాశ్రయంలో కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ ను నిర్మించారు. టెర్మినల్ భవనం తమిళ సంస్కృతిని ప్రతిబింబించేలా అద్భుతంగా తీర్చిదిద్దారు. 1,260 కోట్లతో నిర్మించిన కొత్త టెర్మినల్‌ను శనివారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.