తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘జన నాయగన్’ విడుదలకు ముందు వరుస అడ్డంకులను ఎదుర్కొంటోంది. ఈ సినిమా సెన్సార్ క్లియరెన్స్ విషయంలో తలెత్తిన వివాదంపై తాజాగా సుప్రీంకోర్టులో నిర్మాతలకు నిరాశే ఎదురైంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు కేవలం ‘A’ (అడల్ట్) సర్టిఫికేట్ మాత్రమే ఇస్తామని పట్టుబట్టడంతో, నిర్మాతలు దీన్ని వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించారు. అయితే, ఈ విషయాన్ని నేరుగా విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. వెంటనే మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్‌ను…
Parasakthi: తమిళనాడులో పొంగల్ బరిలో నిలిచిన సినిమాలపై వివాదం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే స్టార్ హీరో విజయ్ నటించిన ‘‘జన నాయగన్’’ సెన్సార్ కష్టాలను ఎదుర్కొంటోంది. తాజాగా మరో శివకార్తికేయన్ ‘‘పరాశక్తి’’ సినిమాపై వివాదం ముదురుతోంది. కాంగ్రెస్‌కు సంబంధించిన చారిత్రక సంఘటనలను వక్రీకరించారని ఆరోపిస్తూ, పరాశక్తి సినిమాపై బ్యాన్ విధించాలని తమిళనాడు యూత్ కాంగ్రెస్ పిలుపునిచ్చింది. 1960లలో విద్యార్థి ఉద్యమం, హిందీ వ్యతిరేక నిరసనల నేపథ్యంలో పరాశక్తి తెరకెక్కింది. ఈ సినిమా జనవరి 10న థియేటర్లలోకి వచ్చింది.…
నేతాజి ప్రొడక్షన్స్, జిఎం ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్ల మీద రిచర్డ్ రిషి హీరోగా సోల చక్రవర్తి నిర్మింస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ద్రౌపది 2’. ఈ మూవీని మోహన్. జి తెరకెక్కిస్తున్నారు.ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల ఈ సినిమా నుంచి ‘ఎం కోనె..(నెలరాజె..)’ అనే పాటను మేకర్స్ విడుదల చేశారు. పాట నేపథ్యాన్ని గమనిస్తే.. కాంచీపురం సంస్థానానికి చెందిన ద్రౌపది దేవి వివాహం కడవరాయ సంస్థానం నుంచి వీరసింహ కడవరాయన్‌తో జరుగుతుంది. అందులో…
మారి సెల్వరాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళంలో తనదైన శైలిలో సినిమాలు చేస్తూ వెళ్తున్న ఆయన, తాజాగా చేసిన కొన్ని వ్యాఖ్యలు కొంతమందికి ఆగ్రహం తెప్పించాయి. అసలు విషయానికి వస్తే, తమిళంలో ఎక్కువగా అణగారిన వర్గాల సినిమాలను చేస్తూ వచ్చేవారు మారి సెల్వరాజ్. అయితే, ఆయన సినిమాలలో తమిళ నటీమణులను ఎందుకు తీసుకోవడం లేదు? అనే విషయం మీద ప్రశ్నిస్తే, ఒక ఆసక్తికరమైన సమాధానం చెప్పాడు. అదేంటంటే, “ఇప్పుడు సినిమాలో ఏదైనా అంగ…