మన రోజువారీ కూరల్లో వాడే టమాట ప్రతి కుటుంబానికి పట్టపగలే చుక్కలు చూపిస్తుంది. గత కొన్ని రోజులుగా టమాటా ధర పైపైకి దూసుకెళ్తుంది. అయితే, ఇవాళ (శనివారం) టమాట ధర ఆల్ టైం రికార్డ్ సృష్టించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి మార్కెట్‌లో నాణ్యమైన టమాట ధర కిలో 196 రూపాయలకు చేరుకుని ఆల్ టైం రికార్డు నెలకొల్పింది.